Latest Posts

పోలీసు శాఖకు 6 బొలేరో వాహనాలు బహుకరించిన ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి…

జిల్లా పోలీసు శాఖకు 6 బొలేరో వాహనాలు బహుకరించిన కందుకూరు శాసన సభ్యులు శ్రీ మానుగుంట మహిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యస్.పి మరియు పోలీసు అధికారులు.

  • జిల్లా పోలీసు కార్యాలయం నందు 6 బొలెరో వాహనాలను యస్.పి. గారికి స్వయంగా అందించిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి.
  • ప్రజలకు చేరువగా రేయింబవళ్ళు జిల్లా పోలీసులు చేస్తున్న సేవకు నా వంతు సహకారం చేయుటకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు-కందుకూరు ఎమ్మెల్యే .
  • రాష్ట్రంలోనే ఎందరో ప్రముఖులకు ఆదర్శవంతంగా ఉండేలా సముచిత నిర్ణయం తీసుకొని చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు- జిల్లా యస్.పి..
  • జిల్లా పోలీసుయంత్రాంగం చేస్తున్న సేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు- యస్.పి..
  • ప్రజలను, అందరు నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ, సఖ్యత కలిగిన, కలుపుగోలుగా ఉన్న యస్.పి. గారి సేవలను కొనియాడారు- కందుకూరు ఎమ్మెల్యే.
  • మా పరిధిలో పోలీసుల అవసరాల నిమిత్తం నా వంతు సహకారం అందిస్తున్నా- కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి.
  • నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరాడంబరంగా ఉంటూ, నిక్కచ్చిగా వ్యవహరించే విశాల హృదయులు కందుకూరు ఎమ్మెల్యే -యస్.పి.
  • కందుకూరు MLA కి కృతజ్ఞతలు తెలిపిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్), అడిషనల్ యస్.పి.(క్రైమ్స్), అడిషనల్ యస్.పి.(AR) మరియు జిల్లా పోలీసు అధికారులు.

Latest Posts

Don't Miss