Latest Posts

పేదల కడుపు కొట్టొద్దు-అంజూరు చక్రధర్

పింఛన్లు తొలగించి పేదల కడుపు కొట్టొద్దు- అంజూరు చక్రధర్

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లేనిపోని నిబంధనలతో లక్షలాది మందికి పెన్షన్లను తొలగిస్తుంది అని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజూరు చక్రధర్ మాట్లాడుతూ,నూతన సంవత్సరం వేల వైసీపీ సర్కారు పింఛను దారుల నెత్తిన పిడుగు వేసింది. సామాజిక భద్రత పింఛను పెంచుతున్నట్లు, ఒకవైపు చెపుతూనే మరోవైపు పెద్ద ఎత్తున లబ్ధిదారుల్లో కోత విధించింది. వివిధ సాకులు చూపుతూ ఒక తిరుపతి జిల్లాలోనే పింఛనుకు అనర్హులంటూ 9,198 మందికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అయితే 1.90 లక్షల మంది అనర్హుల జాబితాలో చేరారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో 1,118 మందికి అనార్హులంటు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న పింఛన్ ధారులు ఆందోళనలో ఉన్నారు. దీంతో పింఛన్లపై ఆధారపడి జీవించే వృద్ధులు, పేద మర మగ్గ కార్మికులు వీధిన పడ్డారు.ఒకపక్క కరెంటు బిల్లులు పెంచి మరోపక్క పింఛన్లు తీసేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వెంటనే తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని లేనిపక్షంలో పింఛన్లు కోల్పోయిన ప్రతి ఒక్కరి తరపున పోరాడుతామని హెచ్చరించారు. పింఛన్ల దారులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేశారు. జై జనసేన… జైహింద్!

Latest Posts

Don't Miss