అమెరికా వెళ్లే విద్యార్థులకు శుభవార్త!
వీసా ఇంటర్వ్యూలో ఒకదఫా విఫలమైన విద్యార్థులకు శుభవార్త. మరోసారి ఇంటర్వ్యూకు హాజరయ్యే వెసులుబాటు కల్పించాలని అమెరికా నిర్ణయించింది. ఫాల్ సీజన్‌కు సంబంధించి దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా(ఎఫ్-1) ధరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్రతి సీజన్లో ఎన్ని దఫాలైనా ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు విద్యార్థులకు అవకాశం ఉంటుంది. గడిచిన ఏడాది నుంచి ఒక్కో విద్యార్థి, ఒక్కసారి మాత్రమే హాజరయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.