సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు టికెట్లో 10 శాతం రాయితీ కల్పించాలని టిఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రానూపోను ఒకేసారి టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నవారికి.. తిరుగు ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకున్నవారికి జనవరి 31వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. రాయితీ సదుపాయం తక్షణమే అందుబాటులోకి వస్తుందని, టికెట్ల రిజర్వేషన్‌కు www.tsrtconline.in వెబ్సైట్లోగానీ, యాప్‌లోగానీ సంప్రదించాలని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు.