Latest Posts

జనసేన,తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు… ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి అరగంట చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ప్రకటించడం ద్వారా పొత్తులకు ద్వారాలు మూయలేదని, కలిసే ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి కట్టుబడివున్నట్లుగా స్పష్టమవుతోంది… ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది?… తన టార్గెట్ రీచ్ అవ్వడానికి టీడీపీపై ఒత్తిడి తేవడానికి కూడా రెడీ అవుతోందా అన్న చర్చ జరుగుతోంది…

ఏపీలో జనసేన, టీడీపీ పొత్తుపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది .. దానికి తగ్గట్లే ఆ రెండు పార్టీల శ్రేణులు కలిసికట్టుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాయి …. అధికారికంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన … మరోవైపు టీడీపీతో కలిసి కార్యక్రమాలు చేపడుతోంది. విజయవాడలో బీజేపీ, జనసేన సమావేశం జరుగుతుందని బీజేపీ నాయకులు మీడియాకు లీకులివ్వగా వాటిని జనసేన ఖండించింది… దీనిద్వారా ఆ పార్టీ బీజేపీతో కలిసి వెళ్లడానికి ఇష్టపడటంలేదని అర్థమవుతోందంటున్నారు…. ఆ క్రమంలో పొత్తు కుదిరితే జనసేనకు ఎన్ని స్థానాలిస్తారు? అనే చర్చ టీడీపీ, జనసేనలో జరుగుతోంది.

పొత్తుల లెక్కలతో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలుగా పనిచేసుకుంటున్నవారు కూడా డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నారు… ఇప్పుడు తాము ఇంత కష్టపడి పనిచేసుకుంటుంటే …తర్వాత నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే తమ శ్రమ, తమ డబ్బులు బూడిదలో పోసినట్లవుతాయనే ఉద్దేశంతో చురుగ్గా కార్యక్రమాలు కూడా చేపట్టడంలేదంట.. పొత్తులంటాయనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి, ఏయే నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టత ఇస్తేనే నాయకులంతా ముందుకు కదిలేటట్లు కనిపిస్తున్నారు

జనసేన 40 నియోజకవర్గాల వరకు డిమాండ్ చేస్తుందని, అలా గట్టిగా డిమాండ్ చేస్తే 30 నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ 25 నియోజకవర్గాలనే కేటాయిస్తానంటే… ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో జనసేన నేతలున్నట్లు తెలుస్తోంది…

కనీసం 40 నియోజకవర్గాలు కేటాయిస్తే అందులో కచ్చితంగా 30 నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగరవేయాలనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారంటున్నారు… వీటన్నింటిమీద పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే రెండు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది… అప్పటివరకు చెలరేగే ఊహాగానాలతో అటు జనసేన, ఇటు టీడీపీ టీడీపీ ఆశావహుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది ..

Latest Posts

Don't Miss