Latest Posts

చైనాలోని రోజుకు 10లక్షల కొవిడ్‌ కేసులు..!

చైనాలోని ఓ నగరంలో రోజుకు 10లక్షల కొవిడ్‌ కేసులు..!

చైనా(China)లో కొవిడ్‌-19(covid19) భయానక స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఒక నగరంలో రోజుకు 10 లక్షల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్షియల్‌ అయిన జెజియాంగ్‌లో రోజువారీ కేసుల సంఖ్య 10లక్షలుగా నమోదవుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఇక్కడ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక ప్రభుత్వం అంచనావేస్తోంది. ”ఇన్ఫెక్షన్‌ కేసులు మరికొన్ని రోజుల్లో తీవ్రస్థాయికి చేరుకొంటాయని అంచనావేస్తున్నాం. కొత్త సంవత్సరం సమీపానికి రోజువారీ కేసుల సంఖ్య దాదాపు రోజుకు 20 లక్షలకు చేరుకోవచ్చు” అని జెజియాంగ్‌ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు రాయిటార్స్ వెల్లడించింది. ఇక్కడ మొత్తం 65.4 మిలియన్ల మంది జీవిస్తున్నారు. స్థానిక ప్రావిన్షెయల్‌ ఆసుపత్రుల్లో 13,583 మందికి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం చైనా(China)లో కొవిడ్‌ (covid19) కేసులను అధికారికంగా ప్రకటించడంలేదు. ఇక మరణాల విషయంలో కూడా కేవలం న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలతో మరణించిన వారినే కొవిడ్‌ (covid19) మరణాల కింద భావిస్తున్నారు. రీసెర్చి సంస్థ క్యాపిటల్‌ ఎకనామిక్స్ ప్రచురించిన పత్రంలో.. ”రానున్న రెండు వారాలు చైనా(China)లో అత్యంత ప్రమాదకరంగా ఉండనున్నాయి. ఇక్కడ రానున్న లూనార్‌ కొత్త సంవత్సరంలో ప్రయాణాలు మొదలైతే దేశంలో ఇప్పటి వరకు లేని ప్రాంతాల్లో కూడా కొవిడ్‌ (covid19) వేవ్‌ పుట్టుకొస్తుంది.అధికారులు దీనిని అడ్డుకోవడానికి ఏమీ చేయలేదు” అని అంచనావేసింది. ఇప్పటికే క్వింగ్‌డావ్‌, డాంగ్యూన్‌ నగరాల్లో రోజువారీ కొవిడ్‌ ఇన్ఫెక్షన్లు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. చాలా నగరాల్లో వైద్య సిబ్బంది అనారోగ్యంపాలైనా విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రిటైరైన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకొంటోంది.

Latest Posts

Don't Miss