Latest Posts

“గజల్”- మీర్జా గాలిబ్ కు ఘన నివాళులు

ఉర్దూ సాహిత్యంలో ‘గజల్’ ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ అని,ఈ ప్రక్రియలో ప్రణయ, విరహ, ఆధ్యాత్మిక భావాలను మనోరంజకంగా ప్రకటించవచ్చని, ఈ గజల్ ప్రక్రియలో మీర్జా గాలిబ్ ఉద్దండులని ,వారు బహాదూర్ షా జఫర్ ఆస్థాన కవిగా విరాజిల్లారని ,వారు దాబిర్-ఉల్- ముల్క్ ,నజం-ఉద్-దౌలా, మీర్జా నోషా వంటి బిరుదులతో సత్కరింపబడ్డారని, వారి గజళ్ళను” గాలిబ్ గీతాలు” పేరుతో దాశరధి తెలుగులో అనువదించారని ,ఉర్దూ గజల్ ప్రభావంతో నారాయణరెడ్డి తదితర లబ్ద ప్రతిష్టులయిన కవులు కూడా తెలుగులో గజల్ ప్రక్రియను ప్రారంభించారని సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన మీర్జా గాలిబ్ 225 వ జయంతి సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ వివరించారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ మీర్జా గాలిబ్ రచించిన “దీవానా- ఏ- గాలిబ్” అనే గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందని, ఎన్నో దేశ విదేశ భాషల్లో అనువదింపబడిందని మీర్జా గాలిబ్ గజళ్ళే గాక వారి లేఖలు కూడా ఉర్దూ సాహిత్యంలో గొప్ప సాహిత్య సంపదగా కొనియాడ పడుతున్నాయని తెలియజేశారు. గాలిబ్ అసలు పేరు మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్ అని ,గాలిబ్ అనే కలం పేరుతో వారు కవితలు రచించారని, 11 సంవత్సరాల వయసులోనే వారు సాహిత్య సృజన చేయటం ప్రారంభించారని, వారి ప్రజ్ఞాపాటవాలు అనన్య సామాన్యమని ప్రముఖ నటులు మస్తాన్ రెడ్డి తెలియజేశారు. ఈ సభలో మర్రి మల్యాద్రి రావు, కీర్తి వెంకయ్య ,ఏం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు ,బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళి రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొని గాలిబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Latest Posts

Don't Miss