టీఎస్ఆర్టీసీ గ్రేటర్ జోన్లో నూతన సంవత్సరం కొత్త జోష్ నింపనుంది. ఇటీవల కొత్తగా 50 సూపర్‌లగ్జరీ బస్సులను ప్రారంభించిన విషయం విదితమే. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు చారిత్రక నగర కీర్తిని ఇనుమడింపజేసే విధంగా.. డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని ఆర్టీసీ భావిస్తోంది. 2023 మార్చిలోపు 10 డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే 560 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచింది. వీటిలో 50 జిల్లాలకు వెళ్లనుండగా, 500 నగరవ్యాప్తంగా తిరగనున్నాయి. 300 ఎలక్ట్రిక్ బస్సుల రాయితీకి సంబంధించి కోర్టు వివాదాలు తలెత్తాయి. అందువల్ల వీటి రాక ఆలస్యమవుతోంది. మిగతావి, 10 డబుల్ డెక్కర్ల విషయంలోనూ ఎలాంటి ఇబ్బందుల్లేవని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. డబుల్ డెక్కర్లను వంతెనలతో ఆటంకం లేని మార్గాల్లోనే తిప్పాలని భావిస్తున్నారు.
తిరగనున్న మార్గాలు:
- సికింద్రాబాద్ – మేడ్చల్
- సికింద్రాబాద్ – పటాన్చెరు
- సికింద్రాబాద్ – లింగంపల్లి
- అఫ్జల్‌గంజ్ – మెహిదీపట్నం
- జీడిమెట్ల – సీబీఎస్
- పటాన్చెరు – కోఠి