అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్థిర సంకల్పంతో, పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు ₹590.91 కోట్లను నేడు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. దీనితో పాటు కొత్తగా జూన్ 2022 నుండి నవంబర్ 2022 వరకు అర్హులైన వారికి పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ళపట్టాలకు ప్రస్తుతం వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ నెల 30న తుది జాబితా ప్రచురించి 2023 జనవరి 1న పెంచిన పెన్షన్‌తో పాటు అన్ని కార్డులు పంపిణీ చేస్తారు.