Latest Posts

అనంతగిరి మాజీ ఎంపీపీ భౌతికకాయానికి నివాళులర్పించిన డా.కుంభా రవిబాబు

అనంతగిరి మాజీ ఎంపీపీ శోభ వీరభద్రరాజు గారి భౌతికకాయాన్ని నివాళులర్పించిన
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు,అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శోభ వీరభద్రరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందారు. ఈరోజు భీమవరం గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు .శోభ వీరభద్రరాజు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని గత నెలలోనే వారిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.అయినప్పటికీ ఆరోగ్యం విషమం కావడంతో నిన్న మృతి చెందారు. ఆయన మృతి తీరని లోటు అని, మంచి వ్యక్తి అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్డా కుంభా రవిబాబుతో పాటు ఎస్టీ కమిషన్ సభ్యులు జంపరంగి లిల్లీ, కొర్రా రామలక్ష్మి,జీసీసీ చైర్ పర్సన్ శోభ స్వాతి రాణి,మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి ,స్థానిక సర్పంచ్ అప్పారావు,జడ్పిటిసి గంగరాజు, ఎంపీపీ నీలవేణి, ఎంపిటిసి మితుల & వైసీపీ నాయకులు చెట్టి వినయ్, తెడబారికి సురేష్ కుమార్, మాజీ జడ్పిటిసి గంగన్నదొర, డుంబ్రిగుడ ఏంఈఓ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss