Latest Posts

అధిక భక్తుల ఆలయాల సందర్శనలో తిరుమలకు రెండవ స్థానం

అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం.దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచిందని ఓయో కల్చరల్‌ ట్రావెల్‌ రిపోర్టు వెల్లడించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. ఇందులో వారణాసి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తిరుమల రెండో స్థానంలో నిలిచిందని సంస్థ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యాటకుల గదుల బుకింగ్‌ తిరుపతి నగరంలో గతేడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగింది. వారణాసి, శిర్డీ తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Latest Posts

Don't Miss