Latest Posts

వివాదాలకు కేంద్రంగా గుడివాడ నియోజకవర్గం

గుడివాడ నియోజకవర్గం ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారిపోయింది. ఒకప్పుడు అన్నగారి పుట్టిన ప్రాంతంగా,గుడివాడ ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. ఇక్కడి వారిలో అక్కినేని నాగేశ్వరావు కొంచెం దూర ప్రాంతమైనప్పటికీ.. అన్నగారి పుట్టిన ఊరు ఉన్నాయని గర్వంగా చెప్పుకొనే వారు. కానీ రాను రాను గుడివాడ తీరు వివాదాలకు కేంద్రంగా మారిపోయింది.గుడివాడలో తలెత్తున్న ఈ పరిస్థితులతో ఎవరికి నష్టం?

ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం గుడివాడ నియోజకవర్గం వాసులను వేధించే పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది… రాజకీయంగా మరింత దూకుడు ఇక్కడ కనిపిస్తుండడం.. ఎవరు ఎప్పుడు వచ్చి భయపెడతారో.. వేధిస్తారో.. అనే భయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి … ఇక సంక్రాంతి, దసరా వంటి సంప్రదాయ పండుగలు వస్తే.. జూదాలు… కోడి పందేలకు ఈ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని అంటున్నారు… -అలాగే కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రచారం జరిగిన క్యాసినోవా క్లబ్ వ్యవహారం ఎంత దుమారం రేపిందో తెలిసిందే…

మరి ఒకప్పుడు ఎన్ని ప్రత్యేకతలతోనో ఉన్న గుడివాడ నేడు ఇంత వివాదానికి కారణం కావడం ఏంటంటే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరగణమేనని అంటున్నారు… లోకల్‌గా గడ్డం బ్యాచ్‌ అని పేరుగాంచి ఆయన అనుచరులు మాత్రం ఇక్కడ మామూలు హడావుడి సృష్టించరు .. తాజాగా కొడాలినాని అనుచరులమని చెప్పుకునే బ్యాచ్ చేసిన వీరంగమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ

గుడివాడలో వంగవీటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.దాంతో ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు, గడ్డం బ్యాచ్‌గా పేరున్న ముఠా లీడర్ కాళీ టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేశారు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు.అది చెప్పటానికి నువ్వెవరంటూ రావి వెంకటేశ్వరరావు గట్టిగా ప్రశ్నించారు.ఎక్కువ మాట్లాడితే నిన్ను లేపేస్తా అని కాళీ ఆయన్ను తీవ్ర స్వరంతో బెదిరించి, అసభ్యపదజాలంతో దుర్బాషలాడారు.విషయం తెలుసుకున్న రావి వర్గీయులు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

ఆ క్రమంలో కొడాలి నాని అనుచరులు టీడీపీ కార్యాలయంపైకి దూసుకొచ్చి పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు యత్నించారు.కర్రలు, కత్తులతో దాడి చేసి, రణరంగం సృష్టించారు.వీడియోలు, ఫొటోలు తీస్తున్న విలేకర్లపైనా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అయిదుగురు విలేకర్లు గాయపడ్డారు.అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.కాళీ, వైసీపీ కార్యకర్తలు,పోలీసులను నెట్టేసి మరీ టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నా చూసీచూడనట్లు ఉన్నారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వ తీరు బహిర్గతం అవుతోంది.

పక్కా ప్లాన్ తోనే టీడీపీ కార్యాలయాన్ని తగుల బెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు టీడీపీ నాయకులు, ఇది వాస్తవానికి రాజకీయంగా పైచేయి సాధించేందుకు మాజీ మంత్రి అనుచరులు చేసినా చివరకు ఇది నాని మెడకు చుట్టుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.ఎందుకంటే.. ప్రశాంతంగా ఉన్న గుడివాడను వివాదాలకు కేరాఫ్ గా మారుస్తున్నారని ప్రజలు ఇప్పటికే మాజీ మంత్రితో పాటు ఆయన బ్యాచ్‌పై అసహనంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.అది కొడాలి నానికే ఎసరు పెట్టడం ఖాయమన్న టాక్ వినిస్తోంది…

Latest Posts

Don't Miss