Latest Posts

వంగవీటి రంగా హత్య కుట్ర టీడీపీదే-కొడాలి నాని

  • వంగవీటి రంగా హత్య కుట్ర టీడీపీదే
  • వంగవీటి రంగా ఆశయాలు ఆదర్శనీయం.
  • టీడీపీ రంగా పేరు లేకుండా రాజకీయం చేయలేదు
  • వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి కొడాలి నాని నివాళి.

వంగవీటి మోహన్ రంగా ఆశయాలు ఆదర్శనీయమైనవని, తన ప్రాణం పోయే వరకు రంగా ఆశయాలు కొనసాగిస్తానని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి కొడాలి నాని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రంగాను ఎదుర్కోలేకనే టీడీపీ హత్య కుట్ర చేసిందన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రంగాను రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ హత్య చేయించిందన్నారు. దేవినేని నెహ్రూ వంగవీటి మోహనరంగాను చంపలేడని, అధికారం అండతో జరిగిన రంగా హత్యకు కారణం వ్యక్తి కాదు.. వ్యవస్థ అని అన్నారు.

వంగవీటి రంగాను హత్య చేసిన పార్టీలు, నాయకులే నేడు రంగా చిత్రపటానికి పూలు వేసి బూట్లు నాకాల్సిన పరిస్థితి వచ్చిందని ఘాటుగా విమర్శించారు. రంగా ఎక్కడకు వెళ్లినా పోలీసులతో తనిఖీలు చేయించి అనుచరులు లేకుండా చేసి అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టీడీపీలో కీలక నేతలుగా ఉన్నారని ఆరోపించారు.  టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దేవినేని ఉమా హత్య కేసులో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ హత్యలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా భాగం ఉందని ఆరోజున ఉన్న పెద్దలు చెప్పారని, రంగాకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, గన్‌మెన్‌లను అడిగినా ఇవ్వకుండా అనుచరులను వెనకాల వెళ్లనివ్వకుండా ఒంటరి వాడిని చేసి టీడీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఆరోజున వంగవీటి మోహనరంగాను హత్య చేశారని కొడాలి నాని పేర్కొన్నారు. 

రంగాను ఎదుర్కొలేకనే హత్యకు కుట్ర:

ఆ రోజున అధికారంలో ఉన్న టీడీపీతో విభేదించి రంగా వ్యక్తి స్థాయి నుంచి శక్తిగా మారి ఉమ్మడి రాష్ట్రంలో విశేష జనాదరణ పొందారని కొడాలి నాని అన్నారు. రంగాను టీడీపీ తన అధికార బలంతో అడుగడుగునా అడ్డగించి, పాతాళానికి తొక్కేయాలని చూసిందన్నారు. ఇవేవీ సాధ్యం కాకపోవడంతో నిర్బంధనలకు గురిచేసి, తనకు ప్రాణహాని ఉందని రంగా చెప్పినా పట్టించుకోకుండా అయ్యప్ప మాలలో ఆమరణ దీక్షకు కూర్చున్న వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారని పేర్కొన్నారు. మనిషిని భౌతికంగా మన మధ్య లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వంగవీటి మోహన రంగాను చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ హత్య చేసిందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం పదవిని, పార్టీని లాక్కొని ఆయన చావుకు ఇదే చంద్రబాబు కారణమయ్యాడు. ఎన్టీఆర్, వంగవీటి రంగా వంటి నేతలు ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. రంగా పేరు చెప్పకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉందన్నారు. 

చంద్రబాబు సారథ్యంలో టీడీపీ నీచాతినీచమైన రాజకీయాల్లో చేస్తోందని, ఎన్టీఆర్‌ను చంపి ఆయన ఫొటోకే దండేస్తారు. రంగాను చంపి రంగా ఫొటోకే దండేస్తారు. సానుభూతి కోసం టీడీపీ నేతలనే చంపి దండలు వేసే పరిస్థితికి టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు. పచ్చ మీడియాకు చెందిన పనికిమాలిన పత్రికలు, ఛానళ్లు, టీడీపీ నేతలు రంగా హత్యను మాపై రుద్దాలని చూస్తే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కాదన్నారు. వంగవీటి రాధా తమ కుటుంబ సభ్యుడని రాధాతో తన ప్రయాణం పార్టీలకు అతీతమన్నారు. వంగవీటి మోహనరంగా ఆశయాలను కొనసాగించేందుకు చివరి రక్తపుబొట్టు ధారపోస్తామని, రంగా చూపిన దారిలో పార్టీలకు అతీతంగా ముందుకెళ్తామని రంగా అభిమానుల్లో ఒకడిగా ఆయన అడుగు జాడల్లో నడుస్తానని తెలిపారు.

గుడివాడలో గొడవ రెండు వర్గాల మధ్యే..

గుడివాడలో జరిగిన గొడవలో టీడీపీ పేరుతో ముందుకు వచ్చిన ప్రతి వ్యక్తి రావి వెంకటేశ్వరరావు దగ్గరే ఉన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏ ఒక్కరైనా గొడవ దగ్గర ఉన్నారా అని కొడాలి నాని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఇది పార్టీల గొడవ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది కేవలం రావి వెంకటేశ్వరరావుకు, రంగా అభిమానులకు మధ్య జరిగిన ఘర్షణే అన్నారు. ఈ గొడవను ప్రభుత్వానికి, పార్టీకి, సీఎంకు, కొడాలి నానికి చుట్టి పబ్లిసిటీ చేసుకోవాలని ఒ వర్గం మీడియా చూస్తోంది. రంగా హత్యలో టీడీపీ, ఆ పార్టీ నేతలు ఉండటం వల్లే రంగా హత్య జరగ్గానే రంగా అభిమానులు రావి వెంకటేశ్వరరావు దుకాణం తగలబెట్టి ఇళ్ల మీద దాడి చేశారని పేర్కొన్నారు.

Latest Posts

Don't Miss