Latest Posts

ముద్రగడ మౌనానికి కారణం ఏమిటో…?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా మౌనం పాటిస్తున్నారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలు నిర్వహించారు.టీడీపీ ప్రభుత్వం ఉన్పప్పుడు ఆ రిజర్వేషన్ల కోసం పెద్ద యుద్దమే చేశారు.అయితే జగన్ సర్కారు రాగానే ఆయన ఎందుకనో సైలెంట్ అయిపోయారు.అదేమంటే తన వర్గంవారే తనని విమర్ధిస్తున్నారని అందుకే అందుకే ఉద్యమం నుంచి ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.అలాంటాయన ఇంత కాలం తర్వాత కాపు రిజర్వేషన్లపై మళ్లీ నోరెత్తారు.ఆయన కోరికను సీఎం జగన్ నెరవేరుస్తారా?

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా స్తబ్దతుగా ఉంటున్నారు.కాపులను బీసీ జాబితాలో చేర్చాలని వారికి రిజర్వేషన్ కల్పించాలని గతంలో ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి, ఆందోళనలు నిర్వహించారు.ముఖ్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంతో ముద్రగడ పెద్ద ఉద్యమమే నిర్వహించారు.అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో కాపులకే 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది.

అయినా సరే ముద్రగడ పద్మనాభం నాడు శాంతించలేదు.ఆయన చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారి.. విజయవాడ- విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టే వరకు వెళ్లింది.ఈ వ్యవహారం నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.వైసీపీ నేతలే రైలుకు నిప్పు పెట్టి అమాయకులైన కాపుల మీదకు నెడుతున్నారని అప్పట్లో టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.

ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేయడం వంటివి జరిగిపోయాయి.పోలీసుల బలప్రయోగంతో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని చంద్రబాబు ప్రభుత్వం అణచివేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి నుంచి కాపు రిజర్వేషన్లపై ఉద్యమంపై తన అభిప్రాయాన్ని చెబుతూనే వస్తున్నారు.కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేవని వాటిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని స్పష్టం చేస్తున్నారు.కేంద్రం కాపులకు రిజర్వేషన్లు కల్పించినా తమకేమీ అభ్యంతరం లేదని.అయితే దీనివల్ల బీసీల రిజర్వేషన్లు దెబ్బతినకూడదనే తమ ఉద్దేశమని పలుమార్లు ప్రకటించి.కాపులకు రిజర్వేషన్లు తనకు ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు.

దానికి తగ్గట్లే జగన్ అధికారంలోకి రాగానే కాపులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను కూడా ఎత్తేశారు… ఆర్థికంగా వెనుకబడిన కులాలన్నింటికీ కేంద్రం పది శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. ఇందులో 5 శాతాన్ని కేవలం కాపులకు మాత్రమే కల్పించడం అన్యాయమని జగన్ తన నిర్ణయాన్ని అప్పట్లో సమర్థించుకున్నారు.

విచిత్రంగా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపుల రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో సైలెంట్ అయిపోయారు.తనను తన తోటి కులస్తులే నిందిస్తున్నారని,అందువల్ల ఇక తాను ఉద్యమం చేయడం సరికాదని, కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ముద్రగడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ప్రకటించారు.ఈ వ్యవహారంలో టీడీపీ వైపు నుంచి గట్టి విమర్శలే వచ్చాయి

మళ్లీ ఇన్నాళ్లకు జగన్ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లను తొలగించడంపై ముద్రగడ పద్మనాభం స్పందించారు.గత చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను తొలగించడం సరికాదన్నారు.ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు…. యధావిధిగా 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కల్పించాలని కోరారు.

కొద్ది రోజుల క్రితం శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు తమ పరిధిలో అంశం కాదని అది రాష్ట్రాల పరిధిలోని అంశమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఏదైనా కులాన్ని రిజర్వేషన్ పరిధిలో చేర్చాలన్నా,తొలగించాలన్నా మార్పులు చేయాలన్నా అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కాపులకు గత ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ ను వర్తింపజేయాలని ముద్రగడ పద్మనాభం తాజాగా జగన్ కు లేఖ రాశారు. మరి ఈ లేఖపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest Posts

Don't Miss