నగదు అక్రమ లావాదేవీ, లంచం తీసుకున్నట్లు నమోదైన కేసుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు యామీన్ ను అక్కడి స్థానిక కోర్టు దోషిగా ప్రకటించింది. మాల్దీవుల మాజీ అధ్యక్షుడికి రూ.41 కోట్ల జరిమానాతో పాటు 11 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2013 నుంచి 2018 మధ్య మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ప్రభుత్వానికి చెందిన ఒక దీవిని లీజుకు ఇచ్చే వ్యవహారంలో ఆయనకు సొమ్ము ముట్టిందని కోర్టు నిర్ధారించింది.