Latest Posts

తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గార్ల కి ఘన నివాళులు…

తెలుగు లెంకగా, అభినవ తిక్కనగా ప్రసిద్ధిగాంచిన తుమ్మల సీతా రామ మూర్తి చౌదరి ఆధునిక పద్య కవుల్లో అగ్ర గణ్యులని, వారు గాంధేయవాద కవిగా ప్రఖ్యాతి నొందారని, గాంధీ గానము ,మహాత్మ కథ,మహాత్మాగాంధీతారావళి ,ఆత్మార్పణము, ధర్మ జ్యోతి వంటి రచనలు చేశారని, వారు చెరుకుపల్లి దగ్గర కావూరులో జన్మించి అప్పికట్లలో స్థిరపడ్డారని సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి మరియు ఊటుకూరు లక్ష్మీకాన్తమ్మ జయంతి సభలకు అధ్యక్షత వహించిన మర్రి మాల్యాద్రి రావు తెలియజేశారు. ఈ సభలో సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ మాట్లాడుతూ ఆంధ్ర విదుషీకుమారి, సాహితీ రుద్రమ గా ప్రసిద్ధినొందిన ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ స్త్రీవాద రచయితులలో ప్రముఖులని శ్రీ వాదంతో కూడిన స్త్రీలే రచించిన తొలి సంకలనం” కథామందారం” ను తొలిసారిగా వెలువరించారని, వారు నాతెలుగుమంచాల ,జాతిపిత, హంస విజయము, ఆంధ్ర కవయిత్రులు, కన్య కమ్మ నివాళి వంటి రచనలు చేశారని, వారు డాక్టరేట్, కళా ప్రపూర్ణ ,తెలుగు మొలక, కవయిత్రి తిలక, వంటి బిరుదులతో సత్కరింపబడ్డారని వివరించారు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి మరియు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఇరువురు బాపట్ల వారు కావటం బాపట్ల వారి అదృష్టమని కస్తూరి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సభలో సప్త స్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కోటి రాజ్ ,టి శ్రీనివాస్,అల్లూరమ్మ, ఆదం షఫీ, తదితరులు తుమ్మల సీతారామమూర్తి చౌదరి మరియు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

Latest Posts

Don't Miss