Latest Posts

తడిఆరని నెత్తురు ఉద్దమ్ సింగ్

  • తడిఆరని నెత్తురు ఉద్దమ్ సింగ్.
    • కొన్ని సార్లు పగ కూడా మనిషిని బతికిస్తుంది…


1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయకప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..
ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని “ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను”అంటూ ప్రతిజ్ఞ చేశాడు.
దీనికి కారకులైన డయ్యర్స్ ను వెతుకుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమాలలో పాల్గొన్నాడు..డయ్యర్స్ లో ఒకరైన ఫ్రాన్సిస్ డయ్యర్ 1927లో భారత్ లోనే చనిపోయాడు. దానితో జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయనమవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు.తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయనమైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడసాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు. ఒకరోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందిందతనికి. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు…ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో దానిని దాచాడు..ఏమీ ఎరగనట్లు ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు….సభలో ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ పొగిడేస్తున్నారు…అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలలాడసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు..ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది…ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆ యువకుడి కూడా గంభీరంలేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు…నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి అప్రమత్తమయ్యే లోపలే పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీయడం,అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించడం జరిగిపోయింది..జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు..ఎవరినైతే నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో…ఆ సంఘటనలోని వ్యక్తి చేతిలోనే ప్రాణాలు విడిచాడు.

ఇది13 మార్చి 1940 న జరిగింది.
ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు…ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా???? షంషేర్ ఉద్దామ్ సింగ్ …. 31 జూలై 1940న పెంటన్‌విల్లే జైలులో ఆ విప్లవవీరుడిని ఉరి తీసిసారు
“జోహార్ ఉద్దాం సింగ్ …జోహార్” భారత మాత యొక్క ఈ ధైర్య కుమారుడి రివాల్వర్, కత్తి మరియు డైరీ బ్లాక్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్ (క్రైమ్ మ్యూజియం)లో భద్రంగా ఉంచబడ్డాయి. కానీ మైఖేల్ ఓ’డ్వైర్ హత్యలో విచారకరమైన భాగం ఏమిటంటే, ఆ సమయంలో భారత నాయకత్వం నుండి దీనికి పెద్దగా మద్దతు లభించలేదు. గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ ఇద్దరూ ఈ హింసాత్మక చర్యను ఖండించారు. శరదర్ ఉధమ్ సింగ్ ధైర్యసాహసాలను సమర్థించిన ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ .ఒక జర్మన్ రేడియో కూడా ఉధమ్ సింగ్‌కు మద్దతునిచ్చింది మరియు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రతీకారం తీర్చుకోవడం భారతీయులు ఎప్పటికీ మరచిపోలేదని అన్నారు. గాంధీ & నెహ్రూ వంటి భారతీయులు షహీద్ ఉధమ్ సింగ్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా ఖండిస్తున్నప్పుడు సర్దార్ ఉధమ్ సింగ్ పేరు టైమ్స్ ఆఫ్ లండన్ ప్రకటించింది.

Latest Posts

Don't Miss