Latest Posts

జనసేన బీజేపీ ల పొత్తు కుదిరిందా

జనసేనతో ప్రమేయంపై తమ పొత్తులపై తెగ స్టేట్‌మెంట్లు ఇస్తూనే వస్తున్నారు బీజేపీ నాయకులు.పవన్ తమ నమ్మకమైన మిత్రుడని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలే కలిసి పనిచేస్తాయని బీజేపీ తెగ లీకులీస్తూ ప్రచారం చేసుకుంటోంది… అయితే వారెంత హడావుడి చేస్తున్నా జనసేన అధినేత కాని, జనసైనికులు కాని పొత్తులపై ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదు.పవన్ కళ్యాన్ తనదైన స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు.ఆ క్రమంలో బీజేపీ హడావుడిపై వినిపిస్తున్న టాక్ ఏంటి? తాము జనసేన పార్టీతో పొత్తులోనే ఉన్నామని భారతీయ జనతాపార్టీ నేతలు పదేపదే చెప్తున్నారు.చంద్రబాబుతో కలిసి పవన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా బీజేపీ నేతలు హడావిడి చేసిన సంగతి తెలిసిందే, తామిద్దరం పొత్తులోనే ఉన్నామని మరోసారి నొక్కి వక్కాణించారు.అయితే పవన్ కల్యాణ్ కు మిత్రపక్షంగా ఎప్పుడు గౌరవమిచ్చారని.. జనసైనికులు బీజేపీపై ధ్వజమెత్తుతున్నారు…

రాష్ట్రంలో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు … బీజేపీ తన కార్యక్రమాలు సొంతంగానే నిర్వహించుకుంటూ వస్తోంది …. గోదావరి గర్జనకుకానీ, మోడీ పర్యటనలకుకానీ, అమరావతి గ్రామాల్లో పాదయాత్రకు కానీ మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారా? లేదా? అనేది ఇప్పటికీ సందేహాస్పదంగానే మిగిలిపోయింది….

దీనిపై రెండు పార్టీలు మాట్లాడటంలేదు … మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ఘంటాపథంగా చెబుతున్నారు … అవసరమైతే పొత్తులతో అందరినీ కలుపుకొని వెళతానని జనసేనాని చేసిన ప్రకటనతో బీజేపీ ఉలిక్కిపడింది…. తన మిత్రపక్షానికి ఇంతవరకు ఎటువంటి మర్యాదకానీ, గౌరవం కానీ ఇవ్వని బీజేపీ నేతలు ఆఘమేఘాలమీద పవన్ ను కలిశారు.

విశాఖపట్నం పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీతో పవన్ కల్యాణ్ 30 నిముషాల భేటీ జరిపారు.మోడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని, ఆ ప్రకారమే పవన్ ముందుకు వెళుతున్నారంటూ బీజేపీ ప్రచారం చేసింది.మోడీని కలిసి మొదటి నాలుగు రోజుల వరకు మాములుగానే ఉన్న పవన్ … మళ్లీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించారు.ఆ క్రమంలో ప్రధానమంత్రి కానీ, బీజేపీకాని ఇచ్చిన రోడ్ మ్యాప్ నచ్చలేదని దానివల్ల జనసేనకు ఎటువంటి ప్రయోజనం లేదనేది జనసేనాని భావిస్తున్నారన్న ప్రచారం మొదలైంది.

ఆ క్రమంలో బీజేపీకి దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలా? అన్నది పవన్ కల్యాణ్ తేల్చుకోలేకపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.బీజేపీతోనే ఉంటే భవిష్యత్తులో తమ పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఆయనలో కనపడటంలేదని, అందుకే బీజేపీ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ సానుకూలంగా స్పందించలేక పోతున్నారంటున్నారు.మరోవైపు చాలారోజుల తర్వాత బీజేపీ-జనసేన నేతల మధ్య భేటీ జరగబోతోందని వార్తలు వచ్చాయి.అయితే అది నిజం కాదని జనసేన తేల్చేసింది.

సుపరిపాలన అనే అంశంపై మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం సందర్భంగా విజయవాడలో జరుగుతున్న సమావేశానికి జనసేన వస్తోందంటూ బీజేపీ నేతలు మీడియాకు లీకులిచ్చారు.అయితే జనసేన వీటిని కొట్టిపారేసింది.సమన్వయకమిటీ సమావేశమేదీ జరగడంలేదని స్పష్టం చేసింది. బీజేపీ నిర్వహించే సభకు తమ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపిస్తున్నామని, అందులో రాజకీయాలుకానీ, పొత్తుల గురించి కానీ ప్రస్తావన ఉండదని జనసేన తేల్చేసింది.

మొత్తంగా చూస్తే కమిటీలకు, సమావేశాలకు తొందరేం లేదనేదన్నది జనసేన భావనగా కనిపిస్తోంది.ఏదేమైనా బీజేపీతో స్నేహం చేయాలంటేనే జనసేన ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.మరి చూడాలి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో?

Latest Posts

Don't Miss