భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా కాకినాడలో సిపిఐ నగర కార్యదర్శి టి.అన్నవరం అధ్యక్షతన సోమవారం ఉదయం స్థానిక కాకినాడలో అచ్యుతాపురం, గోకులం, అయోధ్య నగర్, జగన్నాధపురం, డైరీ ఫారం సెంటర్ తదితర సెంటర్లో జెండా ఆవిష్కరణలు ఘనంగా జరిగాయి. ఈ జెండా ఆవిష్కరణలకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రజాప్రతినిధులు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, గడిచిన ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం కేటాయిస్తామని, పత్రికలకు ప్రచార ఆర్భాటాలకు తప్ప అమలు ఎక్కడా జరగడం లేదని, కాకినాడలో పేద ప్రజల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తాం , పక్కా గృహాలు కట్టిస్తాం అని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కారని, కాకినాడ కార్పొరేషన్ వార్డులో 47, 48, 49, 43, 45 వార్డుల్లో ఉన్న ప్రజలకు ఇంకా ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయడం లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని, గడపగడపకు వైఎస్సార్సీపీ పేరున అందజేస్తామని బూటకపు కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజా ప్రతినిధులు వస్తుంటారు పోతూ ఉంటారని కానీ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అలానే ఉంటున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు ముందు ఇచ్చిన ప్రజాప్రతినిధున హామీలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే వారికి ఓటు ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల మంజూరు కానీ బాధితులతో ఆందోళన చేపడతామని ప్రసాద్ అన్నారు. కార్మిక, కర్షక, బడుగు, బలహీన పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడ లో ఘనంగా నిర్వహించుకుని స్వీట్లు పంపిణీ చేసామని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ (పిఎస్) ,పప్పు ఆదినారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి. వెంకన్న బాబు పార్టీ శాఖల కార్యదర్శులు అప్పయ్య మంత్ర, నరసయ్య, నగేష్, అప్పయమ్మ, సత్యనారాయణ, అప్పన్న, అన్నవరం, లోతు, కొండలరావు, రాజు, మాస సూరిబాబు తదితరులు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.



