- దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ జయంతి వేడుకలను కర్నూలు లో బిజెపి నేతలు ఘనంగా నిర్వహించారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ జోన్ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని అమ్మ వృద్ధుల శరణాలయంలో వాజ్ పేయ్ జయంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో సూపరి పాలన అందిస్తున్నామన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సుపరిపాలన అందించడం లేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల చేతిలో ఉందని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు విఘ్ణవర్దన్ రెడ్డి తెలిపారు.