Latest Posts

ఏలూరు యువశక్తి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పోస్టర్ విడుదల

ఏలూరు గ్రామం యువశక్తి యూత్ ఆధ్వర్యంలో 8వ సంక్రాంతి సంబరాలు 2023జనవరి14నుండి17వరకు రొంగల సూర్యారావు డైరీ ఫాం అల్లూరి సీతారామరాజు ప్రాంగణం వద్ద నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సోమవారం గ్రామ సచివాలయం వద్ద గ్రామ పెద్దలు చేతులు మీదగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువశక్తి యూత్ అధ్యక్ష,కార్యదర్శులు టి.శివదుర్గ,కె.సతీష్ కుమార్ లు మాట్లాడుతూ ఈ సంక్రాంతి సంబరాలు ఏలూరు గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా నిర్వహించి జరుగుతుందని పక్క దారి పడుతున్న యువతను విద్యార్థులను మంచి మార్గంలో మంచి ఆలోచనలు పెంపొందించే కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారన్నారు సంక్రాంతి సంబరాలు జరిగే 4 రోజులు విద్యార్థులు చిన్నారులు డాన్స్ బేబీ డాన్స్ ,అలాగే ఆటలు పోటీలు, జానపద కోలాటం, ప్రజానాట్య మండలి కళాకారులుచే పల్లెపాటలకు నృత్యాలు , యువశక్తి యూత్ మెగా ఈవెంట్స్ మరియు మ్యాజిక్ షో ,చిన్నారుల వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. కావున ఈ సంక్రాంతి సంబరాలకు అందరూ ఆహ్వానితులేని వారన్నారు.గ్రామంలో ఉన్న ప్రజలందరూ పాల్గొన్నాలని జయప్రదం చేయాలని అన్నారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చూక్కా రాంబాబు, ఎంపీటీసీ దాడిశెట్టి రాణి చక్రధర్,మాజీ సర్పంచి జామి మాణిక్యం, రొంగల సూర్యారావు, సూల్క్ విద్యా కమిటీ చైర్మన్ కె.గోవిందు,గ్రామ పంచాయతీ సెక్రటరీ కామారాజు,కొట్టేటి సాయిబాబు,యూత్ సభ్యులు బి.దుర్గ,కె.శివ,ఎన్.శివ,ఆర్.ఈశ్వరరావు, జి.దుర్గప్రసాద్, ఎస్.మధు తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss