Latest Posts

రోడ్‌ షోల్లో కొత్త పుంతలు తొక్కుతున్న బాబు గారి ప్రేలాపనలు-ఎంపి విజయసాయిరెడ్డి

  • రోడ్‌ షోల్లో కొత్త పుంతలు తొక్కుతున్న బాబు గారి ప్రేలాపనలు-ఎంపి విజయసాయిరెడ్డి

నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు శీతాకాలం చలి ముదిరేకొద్దీ ‘కొత్త పుంతలు తొక్కుతున్నాయి.’ ఏ నాయకుడికీ తట్టని రీతిలో ఆయనకు వింత వింత ఐడియాలు వస్తున్నాయి అని ఎంపి విజయసాయిరెడ్డి వాపోయారు. శుక్రవారం బొబ్బిలి సభలో ప్రసంగిస్తూ, ‘అమరావతిలో 3 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి అయింది,’ అని అన్న చంద్రబాబు మాటలు జనానికి షాకిచ్చాయి. అమరావతిలో తెలుగుదేశం పాలలో పాతిక వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇంకా పుట్టని ఈ నగరం శాసన రాజధానిగా ఉంటుందని ప్రకటించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ హయాంలో ఇక్కడ మూడు లక్షల కోట్ల సంపద అదృశ్యమైన విషయం ఎన్టీఆర్‌ గారి మూడో అల్లుడికి మాత్రమే తెలిసుండాలి. అసలు నగరమే కళ్లు తెరుచుకోని పచ్చని పొలాల్లో లక్షల కోట్లు కనుమరుగవడం అనేది చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే బాబు గారికే తెలియాలి. మరో ఆశ్చర్యకరమైన విషయం–చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ దారిలో నడవడం. కొన్ని నెలల క్రితం ఒక సంఘటనను పట్టుకుని నెల్లూరు నగరాన్ని రాష్ట్ర ‘నేర రాజధాని’ అని చినబాబు వర్ణించాడు. ఇప్పుడు తండ్రి ఉత్తరాంధ్ర పట్టణానికి వచ్చి, విశాఖపట్నం రాష్ట్ర ‘గంజాయి–మాదకద్రవ్యాల రాజధాని’గా మారిందని అభివర్ణించారు. కాబోయే పాలనా రాజధానిని ఇలా వర్ణించడం జనం మనోభావాలు పట్టని 72 ఏళ్ల వృద్ధనేతకే సాధ్యమైంది. బొబ్బిలి రోడ్డుషోలోనే ఆయన మరి కొన్ని వింతగొలిపే విషయాలు సెలవిచ్చారు. 1990ల చివర్లో తెలుగుదేశం పాలనలోనే ఉమ్మడి ఏపీలో రైతులు, కూలీల పిల్లలూ ఐటీ కంపెనీల్లో ఉద్యోగులుగా చేరారని చంద్రబాబు సగర్వంగా ప్రకటించుకున్నారు. నిజానికి కంపూటర్‌ సాఫ్ట్‌ వేర్స్‌ కోర్సుల్లో చేరి, ఐటీ నిపుణులుగా మారిన గ్రామీణ ప్రాంతాల యువకులు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించగలిగారు. తనకు పాత్ర లేని అంశాలను తన ఖాతాలో వేసుకోవడం కుప్పం ఎమ్మెల్యేకు అలవాటేగా.
గిట్టని రాజకీయ ప్రత్యర్థులంతా బాబు గారికి ‘సైకో’లే :గత మూడున్నరేళ్లుగా జనరంజకంగా ఏపీని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని, గౌరవ శాసనసభ స్పీకర్‌ ను సైతం ‘సైకోలు’ అని దూషిస్తూ మాట్లాడే నైజం నారా వారిది. వైరి రాజకీయపక్షం నేతలను విమర్శించేటప్పుడు కనీస ప్రజాస్వామ్య మర్యాదలు పాటించాలన్న ఇంగితమే లేదు ఆయనకు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఇలాంటి పదాలను వైఎస్సార్పీపై నేతలపై ఆయన ప్రయోగించారు. అసలు అధికారం లేకుండా బతకలేని నేతలే ‘సైకోలు’గా మారిపోతారనడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? రాజకీయ పార్టీల నేతల సభలకు కొన్నిసార్లు జనం ఎక్కువ మంది వస్తారు. మరి కొన్నిసార్లు తక్కువ సంఖ్యలో వస్తారు. చంద్రబాబు మాత్రం తన సభకు విపరీతంగా జనం హాజరయ్యారని స్వయంగా చెప్పుకుంటూ, ‘నేనేం సినిమా నటుడిని కాదు, అయినా ఇంతగా జనం రావడం దేనికి సంకేతం?’ అంటూ బొబ్బిలిలో సొంత డబ్బా కొట్టుకోవడం ఆయన బలహీన మనస్తత్వానకి అద్దంపడుతోంది. అసలు సినీ నటులు సభలు ఎందుకు పెడతారు? కేవలం వారి మీటింగులకే ఎక్కువ మంది జనం వస్తారా? నేతలను, నటులను చూడడానికి వచ్చే ప్రజల మధ్య తేడా ఉంటుంది కదా? అనే అనుమానాలు తన మాటలు వినేవారికి రావనే ధీమా ఈ హైటెక్‌ నేతకు ఉన్నట్టు కనిపిస్తోంది.

Latest Posts

Don't Miss