విజయనగరం పర్యటనలో భాగంగా గజపతి నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో లో పాల్గొని ప్రజలతో మమేమకమై వారు ఘన స్వాగతం పలికారు నాపై యువత, ఆడబిడ్డల అభిమానం చూసాను.రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ ప్రభుత్వ బాదుడే కనిపిస్తుంది.జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికి పోవడం ఖాయం.రాష్ట్రాన్ని నాశనం చేసిన సీఎంకు పాలించే అర్హత లేదు
రాష్ట్రంలో జగన్ ఒక బందిపోటు అయితే.. గజపతినగరంలో ఎమ్మెల్యే ఓ దోపిడీ దారు.కొందరు అధికారులు తప్ప పోలీసులంతా మన పక్షమే.పాపం వాళ్లకు రావాల్సిన నిధులు, బకాయిలు రావడం లేదుటీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కళంకిత పోలీసులను వదిలేది లేదు.ఉత్తరాంధ్రపై జగన్ కు ప్రేమ లేదు ,ఇక్కడ ఆస్తులపైనే ప్రేమ.ఉత్తరాంద్రలో రూ.40 వేల కోట్లు కొట్టేశారు.తులసీవనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు విజయనగరం లో ఈ బొత్స, అయన తమ్ముడు.భీమ్సింగి షుగర్ ఫ్యాక్టరీ ని మూసేసిన ప్రభుత్వం ఇది.నాడు ఈ ఫ్యాక్టరీ కి మనం నిధులిస్తే వాటిని రివర్స్ చేశారు.ఇక్కడ స్థానిక ఎమ్మేల్యే,వైసిపి ఎమ్మేల్యేలు అంతా ఇసుక దోపిడీదారులే.జగన్ బటన్ నొక్కుడు పేరుతో మరోవైపు బొక్కతున్నాడు.
పేదల జీవితాలు ఎందుకు దుర్భరం అయ్యాయి..? జగన్ పాలన వల్లనే కదా?గజపతినగరం టీడీపీకి కంచుకోట…మళ్ళీ టీడీపీ గెలవాలి.షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తా.రైతులను ఆదుకుంటా సైకో పాలన పోవాలి.సైకిల్ పాలన రావాలి.భయం ఉంటే బానిసత్వం చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.