Latest Posts

వైద్య రంగంలో పెండింగ్లో ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి…

ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) 70వ.వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద శనివారం ఉదయం కే .మోహన్ రావు కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ, కాకినాడ బ్రాంచ్ సెక్రటరీ బుడ్డిగ స్వామి బాబు లు హాజరయ్యారు. ముందుగా ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను తోకల ప్రసాద్ ఆవిష్కరించారు. ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ వర్ధిల్లాలని, ఏఐటియుసి జిందాబాద్ అని నినాదాలు చేశారు. అనంతరం ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశం జరిగింది . ఈ సమావేశంలో స్వామి బాబు, తోకల ప్రసాదు లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య రంగంలో పెండింగ్ లో ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, వైద్య రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఒకటో తేదీ కల్లా జీతాలు మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న డి ఏ, ఇంక్రిమెంట్ లు తక్షణమే పూర్తి చేయాలని, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70 వ. సంవత్సరంలో అడుగు పెట్టింది అని, 70 వ. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి మెడికల్ ఎంప్లాయిస్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించుకుని, స్వీట్లు పంపిణీ చేశామని, వైద్య రంగంలో పనిచేస్తున్న హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్ నుండి ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజిస్ట్, ఎఫ్ ఎన్ ఓ ,ఎం ఎన్ ఓ, తదితర రంగాల్లో పనిచేస్తున్న వారందరు సమస్యలపై ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను తక్షణం పర్మనెంట్ చేయాలని కరోనా ఫోర్త్ వే ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, మందులు కొరత సామాగ్రి కొరత లేకుండా చూడాలని, ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ను తక్షణం పర్మినెంట్ చేసి జీతాలు పెంచి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల అమలు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ (పిఎస్) వి .ప్రసన్న కుమార్ జె. డేవిడ్ రాజు, ఆశ్ర హుస్సేన్, కే. పండు, వీ. సత్యనారాయణ, ఎస్కే అలీషా, ఎస్. రాజబాబు, వై. రాజబాబు ఆస్పత్రిలో పనిచేస్తున్న అన్ని రంగాల వారు, సెక్యూరిటీ గార్డ్స్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss