Latest Posts

వైఎస్సార్ జిల్లాలో వైస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన…

మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన…

రెండవ రోజు ఉదయం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి…

తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్ లో కుటుంబ సభ్యులతో ప్రార్థనలలో పాల్గొని మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో గడపనున్న సీఎం…

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకుంటారు..

విజయ హోమ్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన రింగ్ రోడ్డు ను ప్రారంభిస్తారు. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన పలు విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

అనంతరం నూతనంగా నిర్మించిన కదిరి రోడ్ జంక్షన్, పులివెందుల కదిరి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తారు.

తర్వాత పులివెందుల లో పాత కూరగాయల మార్కేట్ స్థానంలో నూతనంగా అత్యాధునికంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను సీఎం ప్రారంభిస్తారు.

అక్కడి నుండి మైత్రి లే అవుట్ వద్ద నూతనంగా నిర్మించిన వైఎస్సార్ పార్క్ ప్రారంబోత్సవం.

అనంతరం నుతన రాయలాపురం కేబుల్ బ్రిడ్జి( హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి) తరహా బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు

అనంతరం నూతనంగా ఆధునిక హంగులతో నిర్మించిన డా వైఎస్సార్ ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఏర్పాటు చేసిన సభలో దాదాపు 5000 మంది ప్రజలు పాల్గొంటారు.. పులివెందుల లో నేడు ప్రారంభం చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు

అక్కడి నుంచి నాడు నేడు అభివృద్ధి పనుల కింద నూతనంగా నిర్మించిన అహోబిలపురం స్కూల్ అభివృద్ధి పనులు,

తర్వాత 10 MLD STP ( మురుగు నీటి శుద్ధ కేంద్రం) ని ప్రారంభించి,

GTS( గార్బేజ్ ట్రాన్స్ఫర్ సర్వీస్) ను లాంఛనంగా ప్రారంభిస్తారు.

అనంతరం బాకరపురం హెలిప్యాడ్ చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ బయల్దేరి వెళ్తారు.

Latest Posts

Don't Miss