Latest Posts

వరి నాట్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన హిమాన్సు శుక్లా

వరి ఉత్పాదకత పెంచడంలో మేలైన అధునాతన వరి వంగడాలను ఎంపి కతో పాటుగా మెరుగైన యాజమా న్య పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించా లని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా రైతాంగానికి సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామన గరువు గ్రామంలో రబి సీజన్లో వరి నాట్లను వేసే విధానాలను పరిశీలించి సాగు క్షేత్రంలో వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి సమస్యల ఉత్పన్నం కాకుండా తక్కువ కాల పరిమితి కలిగి అధిక దిగుబడుల నిచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతాంగానికి సూచిం చారు. ఏటా సాగు చేసే సాంప్రదా య రకాలకు బదులుగా కొత్త వరి వంగడాలను మీ ప్రాంతాలకు అనువైన, శాస్త్రవేత్తల సిఫార్సులకు అనుగుణంగా రైతులు విత్తనాలు ఎంపిక చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని ,కలుపు మందులు పై సరైన అవగాహన లేకుండా ఉపయోoగించడం వల్ల దిగుబడులు తగ్గి, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని రైతులు, శాస్త్రవేత్తల సిఫార్సులను పరిగణనలో తీసుకుని సాగులో విస్తరణ సేవలను బలోపేతం చేయడం, సాగులో మెలకువలు తెలుసుకోవడం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన లాభసాటి ఉత్పత్తులు సాధించడం, సహజసిద్ధ వనరులతో ఆధునిక సేద్య విధానాలను అమలు పరచటం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులను సస్యరక్షణ పద్ధతులు ఆచరించడం, ముఖ్యంగా రవి సీజన్లో పంట చివరి దశలో సాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా సాగునీటి యజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించి, నీటి వినియోగాన్ని గరిష్టతరం చేస్తూ సాగునీటిని పొదుపుగా వాడి ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానం రైతులకు దరిచేరితేనే సాంకేతికతకు సార్ధకత చేకూరుతుందని ఆ దిశగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సాహించాలన్నారు. ఈ సందర్భంగా రైతులను ఆయన సాగు విధానాలపై ఆరా తియ్యగా రైతులు 125 రోజులు పంట కాలపరిమితి కలిగిన ఎం పి యు 1121 రకo వరి వంగడాన్ని ఎంపిక చేసుకున్నారని స్థానిక గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు తెలిపారు. అదేవిధంగా రబి సాగుకు సంబంధించి సమస్యలు గూర్చి స్థానిక రైతాంగ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss