Latest Posts

మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపబడిన సెమీ క్రిస్మస్ వేడుకలు….

సైనికులు సర్వమతాలను గౌరవించు కొనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని విజయలక్ష్మి పురం లోని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు గారి ఆధ్వర్యంలో లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరపబడినవి. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయం లో పరమ పవిత్ర పండుగ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం అని తెలియ జేసీ మాజీ సైనికులకు మరియు భారతీయులు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ జేశారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా సీనియర్ మాజీ సైనికులు జెట్టి జోసెఫ్ గారిని యూనియన్ సభ్యులు సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రెటరీ తోట దుర్గా రావు, జాయింట్ సెక్రటరీ ఆశోధి రామకృష్ణ రెడ్డి, అసోసియేషన్ సలహాదారులు అల్లావుద్దీన్, అసోసియేషన్ క్లర్క్ వీరాస్వామి, పెద్దలు సుంకర శేషగిరరావు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు

Latest Posts

Don't Miss