Latest Posts

భూముల రిజిస్ట్రేషన్ పై హైకోర్టు సంచలన తీర్పు…

  • ఆంధ్రలో 1954, తెలంగాణలో 1958కి ముందటి అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.
  • మరింత స్పష్టత కోసం మార్గదర్శకాలు రూపొందించిన జస్టిస్ C.V.నాగార్జున రెడ్డి.
  • RSR కాలంలో డాట్లు ఉన్నాయని రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్టవిరుద్ధం.
  • నిషేధిత జాబితాలో ఉన్నాయనడానికి వీల్లేదు.
  • మార్కెట్ విలువ చెల్లించి అసైన్డ్ భూములు పొంది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.
  • రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు తీర్పు అమలు చేయాలి.
  • అమలు చేయకుంటే… కోర్టు ధిక్కారం కింద చర్యలు.
  • తీర్పుకు అనుగుణంగా సర్క్యులర్ జారీ చేయాలని ఆనాటి TDP ప్రభుత్వానికి ఆదేశం.

భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి అటు ప్రైవేటు వ్యక్తులు ఇది రిజిస్ట్రేషన్ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి దిశగా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతేకాక చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్న కొందరు ప్రైవేటు వ్యక్తులకు, రిజిస్ట్రేషన్ అధికారులకు ముక్కుతాడు వేస్తూ అత్యంత కీలకమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఏ భూములను రిజిస్ట్రేషన్ చేయాలి… ఏవి చేయరాదు.. అన్న విషయంలో మరింత స్పష్టతనిస్తూ హైకోర్టు ఈ మార్గదర్శకాలను తయారు చేసింది. ఈ మార్గదర్శకాలన్నింటినీ రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అధికారులు వ్యవహరించినట్లయితే దానిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

హైకోర్టు మార్గదర్శకాలివీ…

1). డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సమయంలో నిరభ్యంతర పత్రం (NOC) తప్పనిసరి అని ఏ రిజిస్ట్రేషన్ అధికారి కూడా ఒత్తిడి చేయడానికి వీల్లేదు. NOC ఇంటిని రిజిస్టర్ చేస్తానని చెప్పరాదు.

2). రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూములుగా,AWD భూములుగా పేర్కొన్న RSR (రీ సెటిల్మెంట్ రిజిస్టర్) కాలమ్ లలో డాట్లు ఉన్నాయనే కారణంతో వాటిని రెవెన్యూ అధికారులు తయారుచేసిన నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్నాయనే ఏకైక కారణంతో ఆ ఆస్తులను రిజిస్టర్ చేసేందుకు ఏ అధికారి కూడా నిరాకరించడానికి వీల్లేదు.

3). రెవెన్యూ రికార్డుల్లో RSR కాలమ్ లో డాట్లు ఉండటం, AWD భూములుగా పేర్కొని ఉంటే సెక్షన్ 22-A(2) కింద ఎడ్యుకేషన్ జారీ చేస్తే తప్ప ఆ భూములను రిజిస్టర్ చేసేందుకు అధికారులు నిరాకరించరాదు. ఇలాంటి భూములు ప్రభుత్వ భూములని, వాటిని రిజిస్టర్ చేయడం ద్వారా తమ హక్కులను కోల్పోతున్నామని ప్రభుత్వం, అధికారులు భావిస్తే ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు.

4). ఆంధ్ర ప్రాంతంలో 18.6.1954కి… తెలంగాణ ప్రాంతంలో 25.7.1958కి ముందు అసైన్మెంట్ ఇచ్చిన భూములను స్పష్టమైన ఆధారాలు ఉంటే ఆ భూములను అధికారులు రిజిస్టర్ చేయాల్సిందే. భూములు రెవెన్యూ శాఖ తయారుచేసిన నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నా సరే.1954, 1958 తరువాత అసైన్మెంట్ ఇచ్చిన భూములను రిజిస్టర్ చేయాలని కోరితే ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ అందుకు గల కారణాలు స్పష్టంగా చెబుతూ రాతపూర్వక సమాధానం ఇవ్వాలి. దీనిపై రిజిస్ట్రేషన్ కోరుతున్న వ్యక్తులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారు చట్ట ప్రకారం తగిన ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు.

5).1954,1958 తరువాత అసైన్మెంట్ కు ఇచ్చారని స్పష్టమైన ఆధారాలు లేకపోతే, సంశయ లాభం రిజిస్ట్రేషన్ కోరుతున్న వ్యక్తులకే ఇవ్వాలి. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ అధికారులు సదరు భూముల విషయంలో 1954,1958 తరువాత అసైన్మెంట్ ఇచ్చారనేందుకు తగిన ఆధారాలను నిర్ణీత కాలవ్యవధి లోపు తమకు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులను రాతపూర్వకంగా కోరవచ్చు. ఆ నిర్ణీత సమయంలోపు రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ అధికారులు ఆ భూములను రిజిస్టర్ చేయవచ్చు.

6). ఇక మాజీ సైనిక అధికారులు, స్వాతంత్ర సమరయోధులకు అసైన్ చేసిన భూములను రిజిస్టర్ చేసే సమయంలో ఆ భూములను అసైన్ చేసి పది సంవత్సరాలు పూర్తయిందా..? లేదా..? అన్న విషయాన్ని చూడాలి ఒకవేళ అసైన్మెంట్ జరిగి పదేళ్లు పూర్తయి ఉంటే మా భూములను రిజిస్టర్ చేయాలి. మిగిలిన కేసుల్లో సెక్షన్ 71 కింద రిజిస్ట్రేషన్ అధికారులు తగిన ఉత్తర్వులు జారీ చేసి వాటిని రిజిస్ట్రేషన్ కోరుతున్న వ్యక్తులకు అందజేయాలి.

7). పొలిటికల్ నఫరర్స్(రాజకీయ కారణాల వల్ల నష్టపోయిన వారు) అసైన్డ్ భూములను కేటాయించి ఉంటే, అటువంటి భూములను రిజిస్టర్ చేయాలని అసైనీలు గానీ, భూములపై హక్కులు కోరుతున్న వారు గానీ కోరితే ఎటువంటి ఆంక్షలు విధించకుండా వాటిని రిజిస్టర్ చేయాలి.

8). మార్కెట్ విలువ చెల్లించి అసైన్డ్ భూములు పొంది ఉంటే, అటువంటి భూములను కూడా రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్టర్ చేయాలి. అయితే అసైన్మెంట్ ఇచ్చే సమయంలో భూములను అమ్మే విషయంలో ఏదైనా నిర్దిష్ట కాలవ్యవధి నిర్ణయించి ఉన్నప్పుడు, ఆ కాలవ్యవధి ఇంకా పూర్తి కాకుంటే ఆ భూములను రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు.

9). దేవాదాయ, వక్ఫ్ భూముల విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోరుతున్న భూములు ఆ సంస్థలకు చెందిన భూములని స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప, ఆ భూములను రిజిస్టర్ చేసేందుకు తిరస్కరించరాదు. ఒకవేళ ఆ సదరు భూములు ఆ సంస్థలకే చెందాయని స్పష్టమైన ఆధారాలు ఉంటే, ఆ ఆధారాల ఆధారంగా రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తున్నట్లు, బుగ్గల కారణాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ ఉత్తర్వులను రిజిస్ట్రేషన్ కోరుతున్న వ్యక్తులకు అందజేయాలి. అభ్యంతరాలు ఉంటే సదర వ్యక్తులు సెక్షన్ 72 కింద ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు.

Latest Posts

Don't Miss