Latest Posts

ప్రతి ఇంటికీ ప్రధాన మంత్రి జలం అదే జల జీవన్ మిషన్ : రూరల్ బిజెపి

రాజమండ్రి రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు యానాపు ఏసు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ పథకంతో నిర్మాణమవుతున్న మంచినీటి ట్యాంక్ లను పరిశీలించారు. కేంద్రం లో మోదీజీ ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో పిఎం జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రానికి 2021-22కి గాను 3,183 కోట్ల రూపాయలు కేటాయించారని అందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలంలో పలు గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో కాతేరు , తొర్రేడు గ్రామాల్లో ట్యాంక్ నిర్మాణ పనులను బిజెపి నాయకులు పరిశీలించారు. ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపిశ్రీనివాస్ మాట్లాడుతూ ఇచ్చిన నిధుల్లో 17శాతం కూడా రాష్ట్రంలోవినియోగించ లేకపోతు న్నారని నరేంద్రమోదీ ప్రభుత్వం అభివృద్ధిని బాధ్యతగా స్వీకరించిందని ఒక్క రాజమండ్రి రూరల్ మండలంలో ప్రస్తుతం వివిధ గ్రామాల్లో 2 కోట్ల 85 లక్షలతో ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని నాణ్యతను పరిశీలిస్తున్నామని నాణ్యత లోపిస్తే సహించబోమని, అభివృద్ధి కేంద్రం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రంగులు వేసుకుంటోందని విమర్శించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు , మురుగు కాలువాలు , వీధి లైట్లు , ఇంటింటికి మరుగుదొడ్లు , గ్రామ పంచాయతీ లకు నేరుగా నిధులు కేంద్రమే అందిస్తుందని ప్రజలకు బిజెపి అండగా ఉంటుందని అన్నారు. యానాపు ఏసు మాట్లాడుతూ నిర్మాణ పనులు కొన్ని చోట్ల నత్తనడకగా నడుస్తున్నాయని కొంతమంది నిర్మాణ పనులు అడ్డుకుంటున్నారని అవగాహన కలిపించడంలో అధికారులు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర నిధులు సక్రమంగా సమయానికి వినియోగించాలని అభివృద్ధిని అందరికి అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు రాయుడు సత్యనారాయణ , కండెళ్ల సురేష్ ఒబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్ , మండల మాజీ అధ్యక్షులు కరుటూరి శ్రీనివాసరావు, మహిళ మోర్చా జిల్లా కార్యదర్శి ఆకుల నర్సవేని, మండల ప్రధాన కార్యదర్శి జల్లూరి గోపినాధ్, పిచ్చుక రాంబాబు, సిద్దాని వెంకట్ , మళ్లివలస రాంబాబు , వి.నాగేశ్వరరావు , బండారు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ ప్రధాన మంత్రి జలం అదే జల జీవన్ మిషన్ : రూరల్ బిజెపి

Latest Posts

Don't Miss