తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ప్రతి విద్యార్థిని ఉన్నత విద్యావంతుడిగా మార్చాలన్న లక్ష్యంతో అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యావ్యవస్థను అమలు చేస్తోంది. ఒకే క్యాంపస్లో కేజీ టు పీజీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది.ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తెలంగాణలో మారుతున్న విద్యా రంగాన్ని మీకు పరిచయం చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది గంభీరావ్పేటలోని కేజీ టు పీజీ క్యాంపస్ అని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి వసతులతో కేజీ టు పీజీ విద్యావ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.