Latest Posts

దేశ విద్యావ్యవస్థలోనే ఇది అపూర్వ ఘట్టం – దూలం నాగేశ్వరరావు

దేశ విద్యావ్యవస్థలోనే ఇది అపూర్వ ఘట్టం అని,విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ చదువులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి YS జగనన్నకు విద్యార్థిలోకం ఋణపడి ఉంటుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.ఈ ఉదయం కైకలూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో కైకలూరు నిమ్మగడ్డ నాగభూషణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండలంలో 8 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు BY JUS TAB ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని టాబ్ లు పంపిణీ చేశారు.తొలుత ఎమ్మెల్యే DNR ను పాఠశాల తరపున, విద్యాశాఖ తరపున పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతించారు. అనంతరం NCC క్యాడెట్స్ గౌరవ వందనం సమర్పించారు.తదుపరి జరిగిన సభలో ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ జగనన్న విద్యపట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ మూలంగా మీ భవిత బంగారుమయం కానుందని అన్నారు.విద్యావ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ,మిగతా రాష్ట్రాలు మనవైపు చూసేలా చేస్తున్నారని అన్నారు.కేవలం డిజిటల్ చదువు కొరకు మాత్రమే ఈ టాబ్ లు పనిచేసేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని BY JUS టెక్నాలజీ తో అందిస్తున్నారని,ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుందన్నారు.కైకలూరు మండలానికి విద్యార్థులకు 578,ఉపాధ్యాయులకు 77 మొత్తం 655 టాబ్స్ ఈరోజు తన చేతులమీదుగా అందించడం ఆనందంగా ఉందని అన్నారు.మీరు మీ మీ ఇళ్లకు ఆనందంగా వెళ్లి మీ తల్లిదండ్రులకు జగన్ మావయ్య ఇచ్చిన ఈ కానుకను చూపించండి…మావయ్యను మనసులో ఉంచుకోమని కోరండని విద్యార్థుల ను ఉద్దేశించి అన్నారు.అనంతరం BY JUS TAB లను విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు.. విద్యార్థుల పట్ల ప్రత్యేక ప్రేమను కనబరుస్తున్న ఎమ్మెల్యే గారిని కృతజ్ఞతాపూర్వకంగా విద్యార్థినీ విద్యార్థులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడివి వెంకట కృష్ణ మోహన్, వైస్ ఎంపిపి మహ్మద్ జహీర్,ఆటపాక సర్పంచ్ తలారి మణి జాన్, ఎంపీటీసీ లు పట్టపు బాలమ్మ,తమ్మిశెట్టి లక్ష్మీ,మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, మండల వైకాపా అధ్యక్షులు భట్రాజు శివాజీ,చిన తాడినాడ సర్పంచ్ గండికోట ఏసుబాబు,ఎంఈఓ దొడ్డా వెంకట రామారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవీంద్ర,
ప్రధానోపాధ్యాయులు రవి ప్రకాష్
పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు ఇందిరాబోస్,సభ్యురాలు రాధ,ఉపాధ్యాయులు జగన్,ఇతర ఉపాధ్యాయులు, మండలంలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss