నిన్న అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన వారికి ప్రభుత్వం తరపున సహాయం అందించాలని సీఎం ఆదేశాలతో బాధితులకు 24 గంటల లోపే లక్ష రూపాయల చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా.రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప 23-12-2022 పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను ముఖ్యమంత్రివర్యులకు వివరించగా తక్షణమే సమస్య పైన స్పందించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి వైద్యానికి సంబంధించి 1 లక్ష రూపాయలు మంజూరు చేయగా ఈరోజు 24-12-2022 ఉదయం బాధితుల కుటుంబానికి తన నివాసంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారు కడప నగర మేయర్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి లక్ష రూపాయలు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానదయ్య,ఉద్యాన శాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి,కార్పొరేటర్లు ,డివిజన్ ఇంఛార్జి లు శ్రీ రంజన్ రెడ్డి,షఫీ,ఎల్లారెడ్డి, సాయబ్, నయీం మేనేజర్ హిదాయతుల్ల,సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు..