కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది.ఇవాళ ఢిల్లీలోని ఎర్రకోట వరకు యాత్ర సాగనుంది. ఢిల్లీలోకి ప్రవేశించగానే రాహుల్ ప్రసంగించారు. కొంతమంది ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. కానీ దేశంలోని సామాన్యులు ఇప్పుడు ప్రేమ గురించిమాట్లాడుతున్నారన్నారు. ప్రతి రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రలో చేరారరన్నారు. మీ ద్వేషపూరిత బజార్లో ప్రేమ దుకాణం తెరవడానికే తాము ఇక్కడ ఉన్నానని ఆర్ఎస్ఎస్-బీజేపీ వ్యక్తులతో చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు.