విశాఖకు పెట్టుబడులు ఇప్పటికే వరదల వలె వస్తున్నాయి..ఐటీ రంగంలో మరింత పెట్టుబడులు తీసుకురావడంపై జగన్ ప్రభుత్వం దృష్టిసారించింది.. అందులో భాగంగానే ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో ప్రపంచ సదస్సు విశాఖ వేదికగా జనవరి 20, 21 తేదీల్లో నిర్వహిస్తోంది.
ఈ సదస్సుకు ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలైన ‘‘మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఐశాట్, విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు..
ఆంధ్ర గొప్పతనాన్ని, ఏపీ పెట్టుబడులకు ఎంత అనుకూలమైనదో ప్రపంచానికి తెలిసేలా వివరిస్తారు దానితో పాటు.. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారు.