Latest Posts

విశాఖలో ఘనంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణ జన్మదిన వేడుకలు…

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జరిగిన వేడుకలు…

విశాఖ సాగరతీరంలో బీసీ సంక్షేమ శాఖ సమాచార సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీచ్ రోడ్ లో కార్యాయంలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిదిగా ,ఏపీ బీసీ కమీషన్ సభ్యులు పక్కిదివాకర్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖపట్నం అధ్యక్షుడు డబ్బీర్ కుమార్ స్వామి విశాఖ నగర బీసీ వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు శ్రీమతి సత్యాల సాగరిక వెంకట్ రాష్ట్ర బీసీ కార్యదర్శి వారణాసి అన్నాజీరావు పాల్గోన్నారు.ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.అనంతరం ఏపీ బీసీ కమీషన్ సభ్యులు పక్కిదివాకర్ మాట్లాడుతూ సిఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న మంత్రి వేణుగోపాల కృష్ణ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత స్ధాయి పదవులలో కొనసాగి బీసీల అభ్యుదయానికి కృషి చెయ్యాలని ఆకాక్షించారు.బలహీర వర్గాలకు ఉన్నత పదువులను ఇచ్చి గౌరవించిన ఘనత ఏపీ సిఎం జగన్ కు దక్కుతుందని అన్నారు.బీసీల అభ్యున్నతికి ఉన్నత స్ధాయిలో అధ్యయన కమిటీని వేసి 56 కార్పోరేషన్లకు చైర్మన్లు,700 డైరెక్టర్లతో బీసీల అభివృద్దికి జగన్ ఎనలేని కృషిని అందిస్తున్నారని పేర్కోన్నారు.ముఖ్యంగా మహిళల సార్ధికారతకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని,మరో 30 ఏళ్ల పాటు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని,తద్వారా బీసీలతో పాటు అన్నీ వర్గాల ప్రజలు అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు.గత ప్రభుత్వ హాయంలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని,కానీ సిఎం జగన్ బీసీలకు వెన్నుదండుగా నిలిచి వారి అభివృద్దే ధ్యేయంగా సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కోన్నారు.ఈ వేడుకల్లో ,బీసీ ప్రధాన కార్యదర్శి వెంకట్,బీసీ సెల్ ప్రసిడెంట్ సూర్య ప్రకాష్,బీసీ సంఘం నాయకులు దమ్ము నాగేశ్వరావు, విశాఖ నగర వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు పాటోజు ప్రసాద్, విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి పండోజూ శేఖర్ తదితరులు పాల్గోన్నారు.

Latest Posts

Don't Miss