Latest Posts

నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా అడుగులు వేస్తా – దాడిశెట్టి వీరబాబు

2024 ఎన్నికలలో ప్రధాన పార్టీలతో పోటిలో దీటుగా కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిశెట్టి వీరబాబు పేరును ప్రకటించిన జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా దాడిశెట్టి వీరబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కేటాయించడంపై పార్టీ అధ్యక్షులకు కృతజ్ఞత తెలియజేశారు. పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడి పని చేస్తానని ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజవర్గ మేనిఫెస్టో విడుదల చేశారు
(1) ఏలేరు జలాశయంలో నీటిని నియోజవర్గం లో రైతులు వ్యవసాయం చేయడానికి వాడుకునేలా ఏలేరు నీటిపై నీటి హక్కు కల్పిస్తాను.
(2) ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం ప్రత్తిపాడు ,శంఖవరం, రౌతులపూడి లలో ఉన్న ప్రధాన ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాను ప్రత్తిపాడు ఆసుపత్రిని వంద పడగల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను ప్రజలకు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చేస్తాను, సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చేస్తాను పాము కాటు కుక్క కాటు మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తాను. 108 అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చేస్తాను.
(3) ప్రత్తిపాడు నియోజవర్గంలో ఐటిఐ మరియు ఐఐటి సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాను
(4) నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించి నియోజకవర్గం లో భారీ పరిశ్రమలు స్థాపించే విధంగా కృషిచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను
(5) ఏలేశ్వరం మండలంలో ఏలేరు జలాశయ ప్రాంతం, ప్రత్తిపాడు మండలంలో ఎరకంపాలెం ప్రాంతం, శంఖవరం మండలంలో ఆంధ్ర శబరిమలై అన్నవరం, రౌతులపూడి మండలంలో గంగవరం ఎన్ ఎన్ పట్నం లను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాను
(6) విద్య హక్కు చట్టం నూటికి నూరుశాతం అమలు అయ్యేలా చర్యలు మరియు పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో 25% సీట్లు ఉచితంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటాను
(7) డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా సూక్ష్మ కుటీర పరిశ్రమలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను
(8) గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాను ప్రతి పాఠశాలలో ఆట స్థలాలు ఏర్పాటుకు కృషి చేస్తాను
(9) ప్రజలకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కులాయిలు ఏర్పాటు చేస్తాను
(10) ఎర్రవరం, ప్రత్తిపాడు,, కత్తిపూడి, జాతీయ రహదారిపై అన్ని వసతులతో కూడిన హైటెక్ బస్టాండ్ లు ఏర్పాటుకు కృషి చేస్తాను
(11) గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలకు కలుపుతూ నాలుగు లైన్లు రోడ్లను ఏర్పాటు చేయుట కృషి చేస్తాను, రహణ సౌకర్యం ఏర్పాటుకు చేస్తాను, గిరిజన ప్రాంతంలో కరెంటు సదుపాయం మరియు త్రాగునీరు సదుపాయం ఉండేలా కృషి చేస్తాను
(12) ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు వారి ఇంటి వద్ద స్వయం ఉపాధి పొందేలా సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను
(13) స్థానికంగా ఉన్న మైనింగ్ సంస్థలలో గిరిజనులకు భాగస్వామ్యం మరియు పరిశ్రమ లలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాను

Latest Posts

Don't Miss