Latest Posts

జగన్ అందించిన ట్యాబ్స్ కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభయాన్‌లో భాగమే-సోము వీర్రాజు

సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభయాన్‌లో భాగమేనని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు, నేడు’ నిధుల్లో కూడా కేంద్రం వాటా ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న తీరు మారాలన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళను పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ (VRS) ఇవ్వటం ఖాయమని సోము వీర్రాజు అన్నారు. బీసీలు తెలంగాణ నుంచి విడిచి వెళ్ళిపోయేలా సీఎం కేసీఆర్వైఖరి ఉందని విమర్శించారు. అక్కడ చాలా మంది బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. కేసీఆర్‌లా ఆంధ్ర ప్రజలను ద్వేషించిన వ్యక్తికి జాతీయ పార్టీ పెట్టే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో కాపులను చేర్చే అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందని సోము వీర్రాజు అన్నారు.

Latest Posts

Don't Miss