Latest Posts

గుప్త నిధుల కోసం పురాతన గుడులే వారి టార్గెట్

పల్నాడు జిల్లా మాచవరం బెల్లంకొండ మండలాల్లో గురువారం రాత్రి సుమారు పదిమంది వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ కోటయ్య సంఘటన ప్రాంతానికి చేరుకొని తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో నలుగురు మాత్రమే పోలీసుల అదుపులో ఉండగా మిగిలిన వారు పరారయ్యారు. మాచవరం మండలం గోవిందాపురం బెల్లంకొండ మండలం కామేపల్లి గ్రామాల్లోని పురాతన దేవాలయాల్లో ఈ గుప్త నిధుల తవ్వకాలను ప్రారంభించారు. నలుగురు నిందితుల్లో శ్రీనివాసరెడ్డి, లాలాబీమ్ల ,నాగేశ్వరరావు ,తిరుమలరావు వీరంతా వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఒక్కరుగా చేరి ఈ గుప్త నిధులు తవ్వకాలను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో 1000 సంవత్సరాల నాటి పురాత దేవాలయాలు కాబట్టి వీటిలో బంగారం దొరుకుతుందని ఈ గుప్త నిధులు తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో మాచవరం ఎస్సై కోటయ్యతో పాటు సిబ్బంది అశోక్ బాబు ,రాజేష్,సుభాష్ ,వెంకటేశ్వర్లు ఉన్నారు…..

Latest Posts

Don't Miss