కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఏపీ అలర్ట్ అయింది. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో మంత్రి విడదల రజిని అత్యవసర సమీక్ష నిర్వహించారు. గతంలో లాగే కోవిడ్ పై ముందస్తుగా అప్రమత్తం కావాలని అధికారులకు సూచించారు. బీఎఫ్.7పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి హెల్త్ సెంటర్లో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించేలా కిట్స్ సిద్దం చేయాలన్నారు.