“కడప ఉక్కుఫ్యాక్టరీ మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజు మీరిచ్చిన హామీ గుర్తుందా కోతల రెడ్డి గారూ” అంటూ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు.శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు ఫ్యాక్టరీ ఏది? ఎక్కడ? అని ప్రశ్నించారు.ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి, 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఊరించి ఉసూరుమనిపించారన్నారు. కన్నతల్లిలాంటి కడపకు, రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ గడ్డకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం చంద్రబాబు విజనరీ పాలన అని… శంకుస్థాపన చేసి మరిచిపోవడం జగన్ రెడ్డి ప్రిజనరీ పాలన అని వ్యాఖ్యలు చేశారు.
”ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, సాక్షి, భారతి సిమెంట్ కోసం బటన్ నొక్కి కోట్లు నొక్కేసే కోతల రెడ్డిగారూ.. కడప ఉక్కుఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఓ సారి బటన్ నొక్కండి” అంటూ లోకేష్ యెద్దేవా చేశారు.