పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది.ఇటీవల పవన్‌ కల్యాణ్‌.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.రూ. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా?. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం ఆక్షేపణీయం. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.