అట్లూరి రామమోహనరావు కన్నుమూత.. నివాళులర్పించిన రామోజీ రావు

రామోజీ గ్రూపు సంస్థల్లో.. సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు కన్నుమూశారు. ఈనాడు పత్రిక ఉన్నతిలో, విస్తృతిలో ఆయనది ప్రత్యేక స్థానం. ఐఐఎంల వంటి అత్యుత్తమ సంస్థల్లో చదువుకోపోయినా.. అతిసామాన్యులతో అసాధారణ పనులు చేయించిన నేర్పరి రామమోహనరావు. యాజమాన్య ప్రతినిధిగా.. ఉద్యోగుల శ్రేయోభిలాషిగా ఇరువుర్నీ మెప్పించిన సవ్యసాచి ఆయన. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బందిని ప్రోత్సహిస్తూ.. నిరంతరం ప్రేరణ కల్పిస్తూ.. నిరాడంబర కర్మయోగిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన స్ఫూర్తి ప్రదాత రామమోహనరావు.

రామోజీ గ్రూపు సంస్థల్లో దశాబ్దాలపాటు ఎండీగా సేవలందించిన.. అట్లూరి రామ్మోహనరావు అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం.. ఒంటి గంట 49 నిమిషాలకు హైదరాబాద్ లోని.. ఎఐజిలో తుదిశ్వాస విడిచారు ఆయన. రామమోహనరావు పార్థివదేహాన్ని బంధు, మిత్రుల సందర్శనార్థం జూబ్లీహిల్స్​లోని నివాసానికి తరలించారు కుటుంబ సభ్యులు.

అట్లూరి రామమోహనరావు కన్నుమూత.. నివాళులర్పించిన రామోజీ రావు

రామమోహనరావు భౌతికకాయానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు.అలాగే రామమోహనరావు భౌతికకాయాన్ని సందర్శించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

అట్లూరి రామమోహనరావు కన్నుమూత.. నివాళులర్పించిన రామోజీ రావు