విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన రక్షణ శాఖ సలహాదారులు

కేంద్ర రక్షణ శాఖ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌, డీఆర్‌డీఓ పూర్వపు ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. పీఠ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివార్లను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా రాజశ్యామలా అమ్మవారి విశిష్టతను పీఠాధిపతులు వివరించగా రక్షణ శాఖ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ సతీష్‌రెడ్డి ఆసక్తిగా విన్నారు. పూర్వకాలంలో యుద్ధాలకు వెళ్ళేటపుడు అమ్మవారిని రాజులు ఆరాధించిన విధానాలను, తద్వారా సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రక్షణ శాఖ సీనియర్ సైంటిస్ట్ చంద్రశేఖర్ కూడా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు