US Recession: రానున్నది మహా మాంద్యం.. ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన వ్యాఖ్యలు.. ప్రజల్ని ప్రభుత్వాలు రక్షించలేవు..

     For Quick Alerts 

Subscribe Now      

US Recession: రానున్నది మహా మాంద్యం.. ప్రముఖ ఆర్థిక వేత్త సంచలన వ్యాఖ్యలు.. ప్రజల్ని ప్రభుత్వాలు రక్షించలేవు.. 

For Quick Alerts 

ALLOW NOTIFICATIONS      

bredcrumb

bredcrumb

   |                                           Published: Monday, September 26, 2022, 11:58 [IST]                   

US Recession: మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది 2008 పతనమే. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీలు సైతం కనుమరుగైపోయిన రోజులవి. కంపెనీల పునాదులు కదిలిన మహా ఆర్థిక సంక్షోభం అది. అయితే ఇప్పుడు అలాంటి మరో మాంద్యానికి చాలా దగ్గరగా ప్రపంచం ఉంది. ఇది అనేక మంది ఆర్థిక వేత్తలు చెబుతున్న మాట.

ఆర్థికవేత్త వ్యాఖ్యలు..  

ఆర్థికవేత్త వ్యాఖ్యలు..

ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటం చాలా కీలకం. ఎందుకంటే పెద్దన్నతో వాణిజ్యంతో పాటు డాలర్ మార్పిడి విధానం ఉన్నందున అది అందరికీ కీలకం. అయితే ఈ సారి వచ్చే ఆర్థిక సంక్షోభం 2008 కంటే తీవ్రంగా ఉంటుందని ప్రముఖ ఆర్థికవేత్త రోబిని మాక్రో అసోసియేట్స్‌ ఛైర్మన్‌, సీఈవో నోరియల్‌ రోబిని వెల్లడించారు.

ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. అప్పట్లో సంక్షోభాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. ఈ ఏడాది చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుని వచ్చే ఏడాది పూర్తిగా మాంద్యంలోనే కొనసాగుతాయని హెచ్చరించారు. ఇది ప్రపంచ దేశాలను కుదిపేస్తుందని రోబిని అన్నారు.

 అప్పుల్లో ఆర్థిక వ్యవస్థలు..

అప్పుల్లో ఆర్థిక వ్యవస్థలు..

ప్రపంచలోని అన్ని దేశాలు అప్పులు అనే ఇంధనంతోనే నడుస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు పరిమితికి మించి చేస్తున్న అప్పులు సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. దీనికి మన పొరుగున సంక్షోభంలోకి జారుకున్న శ్రీలంక పెద్ద ఉదాహరణ. 2008లో హౌసింగ్ బబుల్ సమయంలో బ్యాంకులు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు మాత్రమే దెబ్బతిన్నాయి. కానీ ప్రస్తుతం ఏకంగా ప్రభుత్వాలు కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నాయి. అప్పుపుడితే కానీ పొద్దుగూకని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ద్రవ్యోల్బణ భారం..

ద్రవ్యోల్బణ భారం..

కరోనా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగా.. దానికి రష్యా యుద్ధం తీవ్రతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరింది. గడచిన దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచటం, పెద్ద ఎత్తున ఉపశమన ప్యాకేజీలను ప్రకటించటం మనం చూస్తున్నాం. రేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించటంతో పాటు ఆదాయాలు పడిపోతున్నాయి.

రానున్న కాలంలో ఇవి కొనసాగితే ఆర్థిక మాంద్యం భయంకరంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అయినా అనేక దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మాత్రం పెంచుతున్నాయి. ఫెడ్‌ నవంబర్, డిసెంబర్ నాటికి మరింత రేట్ల పెంపు ప్రకచించనుంది. రిజర్వు బ్యాంక్ సైతం అదే దారిలో ముందుకు సాగుతోంది. దీని వల్ల ఉపశమనం కలగకపోగా సామాన్యులకు అప్పుల భారం మరింతగా పెరుగుతోంది.

రక్షించలేని స్థితిలో ప్రభుత్వాలు..  

రక్షించలేని స్థితిలో ప్రభుత్వాలు..

ఈసారి వస్తున్న మహా మాంద్యాన్ని ఎదుర్కొనే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే వాటి వద్ద అంత స్థాయిలో నిధులు సైతం లేవు. ఈ క్రమంలో మార్కెట్లు సైతం కుప్పుకూలుతున్నాయి. అమెరికా సూచీలు 40 శాతం వరకు నష్టపోగా, భారతీయ మార్కెట్లు ప్రస్తుతం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. అమెరికా, జపాన్‌, యూరప్‌, చైనాతో సహా ప్రధాన స్టాక్‌ మార్కెట్లపైనా ఈ ప్రభావం ఉంటుందని రోబిని అన్నారు.

ప్రపంచంలో మరిన్ని ఇబ్బందులు..

ప్రపంచంలో మరిన్ని ఇబ్బందులు..

ప్రస్తుతం ఉన్న సమస్యలకు తోడు ప్రపంచంలో ఉన్న మరిన్ని ఇబ్బందులు సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయి.

 • కరోనా వల్ల చైనాలో కొనసాగుతున్న ఆంక్షలతో కుదేలైన ఉత్పత్తి రంగం

 • సరఫరా గొలుసు దెబ్బతినటం వల్ల పెరుగుతున్న వస్తువుల ధరలు

 • తారా స్థాయిలకు చేరుకుంటున్న రిటైల్ ద్రవ్యోల్బణం

 • అనేక దేశాల్లో పాటిస్తున్న వాణిజ్య రక్షణ విధానాలు

 • అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న వృద్ధ జనాభా

 • చైనాను వీడుతున్న ప్రపంచ ప్రఖ్యాత దేశాలు

 • తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్

 • చైనాలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న రియల్ ఎస్టేట్ క్రైసిస్

      English summary
  

american economist Nouriel Roubini estimates us recession severe than 2008 crisis know details

american economist Nouriel Roubini estimates us recession severe than 2008 crisis know details..

Story first published: Monday, September 26, 2022, 11:58 [IST]