మోడికి తప్పిన ప్రమాదం

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమయాక యువకులను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు పంపేందుకు ధార్మిక సంస్థల పేరిట సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అంతే కాకుండా సంస్థ పేరుతో విదేశాల నుంచి విరాళాలు సేకరించి. దేశంలో అలజడులు సృష్టిస్తున్నారు. అలా బయటపడిన సంస్థే.. పీఎఫ్ఐ. అయితే ఇప్పుడు పీఎఫ్ఐ గురించి నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఇంతకూ పీఎఫ్ఐ గురించి నిఘా సంస్థలు తేల్చిందేంటి..? పీఎఫ్‌ఐ నేతలు ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుగొలింపే ప్లాన్ ఏంటి..? ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వెలుగులోకి వచ్చిన వాస్తవాలేంటో చూద్దాం.

దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ మూలాలు తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్న సమాచారంతో పాటు.. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. అంతే కాకుండా దేశంలోని యువకులను రెచ్చగొట్టి ఐఎస్ఐఎస్‌కు పంపిస్తున్నట్టు నిర్ధారించాయి. దాంతో ఎన్ఐఏ ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకునింది. అందులో నమ్మలేని నిజాలను కనుక్కున్న ఎన్ఐఏ ఇప్పుడు దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ పథకం రచించిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. జులై 12 న బీహార్ లో జ‌రిగిన ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర్యాలీని ల‌క్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పీఎఫ్ఐ ప్లాన్ చేసిందని ఈడీ వెల్లడించింది. అయితే కట్టుదిట్టమైన భద్రత వల్ల పీఎఫ్ఐ ఈ దాడి చేయలేకపోయిందని తేల్చంది. చాలా కాలంగా పీఎఫ్ఐ కార్యకలాపాలపై నిఘా ఉంచామని దాంతో ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తోందని కుండబద్దలు కొట్టింది.

దేశంలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన పీఎఫ్ఐ.. యువకులను రెచ్చగొట్టి ఉద్రక్తతలకు కారణమయిందని నిఘా సంస్థలు తేల్చాయి. అంతే కాకుండా ఉగ్ర శక్తులతో చేతులు కలిపి ఉత్తరప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లోని వ్యక్తులపై ఏకకాలంలో దాడి చేసేందుకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకుందని నిఘా సంస్థలు గుర్తించాయి. కేర‌ళలో అరెస్టయిన పీఎఫ్ఐ స‌భ్యుడు ష‌ఫీక్ పాయెత్ రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను ఈడీ వెల్లడించింది. ప్రధాని మోదీ పాట్నాకు వెళ్లే స‌మ‌యంలోనే దాడులు చేసేందుకు.. పీఎఫ్ఐ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసింద‌ని తెలిపింది. పీఎఫ్ఐ ఎన్నో ఏళ్ల నుంచి కూడ‌బెట్టిన 120 కోట్లను ఈడీ సీజ్ చేసింది.

విదేశాల నుంచి విరాళాల రూపంలో సంపాదించిన మొత్తాన్ని.. దేశంలో అల్లర్లు సృష్టించడానికి వినియోగించిందని నిఘా సంస్థలు తేల్చాయి. దాంతో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకలాపాలు బయటపడ్డాయి. అంతే కాకుండా విదేశాల నుంచి వచ్చిన సొమ్మును నగదుగా మార్చేందుకు కొందరు ఎన్‌ఆర్ఐల ఖాతాలను చట్టవిరుద్దంగా వాడుకుందని సైతం గుర్తించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా పీఎఫ్ఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఇంకా వారిని విచారిస్తోంది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఐదుగురు పీఎఫ్ఐ సభ్యులను సెప్టెంబర్ 26 వరకు మహారాష్ట్ర ఏటీఎస్ కస్టడీకి పంపింది.

బ్యాంకింగ్, హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా భారతదేశంతోపాటు విదేశాల నుంచి నిధులు సేకరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్‌ సమాచారం వచ్చింది. దాంతో పీఎఫ్ఐపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన అన్సాద్ బద్రుద్దీన్, మౌద్ అహ్మద్ అనే ఇద్దరు పీఎఫ్‌ఐ సభ్యులకు వివిధ పీఎఫ్‌ఐ ఖాతాల నుంచి నిధులు తీసుకున్నారని దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా పీఎఫ్ఐ సభ్యులు ఇతర సభ్యులకు ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు శిక్షణ ఇచ్చారని బయటపడింది. నిఘా సంస్థలు మాటు వేయక పోతే.. దేశంలో విధ్వంసం జరిగేదని మేదావులు చెబుతున్నారు.