Software Jobs: రూ.60 లక్షల శాలరీ కోరుకుంటున్నారా..? ఈ కోర్సులు నేర్చుకున్న వారికి అవకాశం..

     For Quick Alerts 

Subscribe Now      

Software Jobs: రూ.60 లక్షల శాలరీ కోరుకుంటున్నారా..? ఈ కోర్సులు నేర్చుకున్న వారికి అవకాశం.. 

For Quick Alerts 

ALLOW NOTIFICATIONS      

bredcrumb

bredcrumb

   |                                           Published: Sunday, September 25, 2022, 10:58 [IST]                   

High Paid Jobs: ఈ రోజుల్లో ఎవరిని కదిపినా ఏం జాబ్ చేస్తున్నవ్ భయ్యా అంటే సాఫ్ట్ వేర్ అని గర్వంగా చెప్పుకుంటుంటారు. అందులో వారికి వచ్చే జీతం, ఆ జీతానికి సమాజంలో దొరుకుతున్న గౌరవం అలాంటి. అందుకే యువత ఎక్కువగా ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.. పూర్తి వివరాలు చూద్దాం..

వేగంగా మారుతున్న టెక్నాలజీ..  

వేగంగా మారుతున్న టెక్నాలజీ..

ప్రపంచంలో టెక్నాలజీ మార్పులు గతం కంటే వేగంగా జరుగుతున్నాయి. రోజుల వ్యవధిలోనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రంగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఇందులో కొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇందులో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా సరిపడా నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో లేరు. ఇలాంటి రంగాల్లో కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి 5 స్కిల్స్ దోహదపడతాయి. వీటిలో రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్..

సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్..

సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ అనేది ఒక హై లెవర్ కంప్యూటర్ ప్రోగామింగ్ జాబ్. ఇందులో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఎలాంటి సాంకేతికతలను వినియోగించాలి, అందుకోసం ఏ ప్రాసెస్ ఉపయోగించాలి వంటి పనులను చూసుకుంటారు. మన దేశంలో ఔత్సాహికులు IITల నుంచి దీనిపై రీసెర్చ్ కూడా చేయవచ్చు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు భారీ వేతనాలను కంపెనీలు అందిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ సగటు వార్షిక వేతనం ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు మార్కెట్లో ఉంది. డేటా అనలిస్ట్..

డేటా అనలిస్ట్..

డేటా అనలిస్ట్ అందుబాటులో ఉన్న వేరువేరు సమాచారాలను సేకరించి వాటి నుంచి అవసరమైన సమాదానాలను కనుగొంటారు. సమస్యల పరిష్కారానికి వీరు డేటాను వినియోగిస్తారు. వీరు డేటా సెంటర్లను మెయిన్ టెన్ చేస్తుంటారు. డేటా మేనేజర్లకు సైతం భారీ వేతనాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం వీరికి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు జీతాలను కంపెనీలు అందిస్తున్నాయి. డేటా సైంటిస్ట్..

డేటా సైంటిస్ట్..

ప్రస్తుతం టెక్ మార్కెట్లో డేటా సైంటిస్టులకు భారీ డిమాండ్ ఉంది. మార్కెట్లో పోటీని తట్టుకుని కంపెనీలను విజయపథం వైపు నడిపేందుకు వీరి మద్ధతు చాలా కీలకం. వీరు సమాచారాన్ని చాలా నిశితంగా విశ్లేషిస్తుంటారు. దిగ్గజ కంపెనీలైన Google, Amazon, Microsoft, Paytm, Meta, Twitter వంటి అనేక కంపెనీల కస్టమర్లకు చెందిన భారీ డేటాలను జాగ్రత్తగా స్టోర్ చేయటంలో వీరి పాత్ర కీలకం. అందుకే వీరికి అంత డిమాండ్. వీరికి సైతం కంపెనీలు గరిష్ఠంగా ఏడాదికి రూ.60 లక్షల వరకు జీతాలను చెల్లిస్తున్నాయి.

క్వాలిటీ మేనేజర్..

క్వాలిటీ మేనేజర్..

సాఫ్ట్ వేర్ కంపెనీలకు ప్లాజెక్టుల్లో సాఫీగా పని జరగటం చాలా ముఖ్యం. క్వాలిటీ మేనేజర్లు ఉత్పత్తి, సేవల నాణ్యత స్టాండెడ్స్ పర్యవేక్షణకు చాలా కీలకంగా మారుతున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీల్లో సైతం వీరికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరికి కంపెనీలు సగటున రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు జీతాలిస్తున్నాయి.

కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజనీర్..

కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజనీర్..

కంప్యూటర్ పరికరాల కోసం చిప్ సర్క్యూట్ బోర్డ్‌లను రూపొందించటం, వాటిపై పరిశోధనలు చేయటం, వాటిని పరీక్షించడం వీరి పని. దీని కింద కంప్యూటర్ విడిభాగాలను రిపేర్ చేయడం, కంప్యూటర్లను అసెంబ్లింగ్ చేయడం, నెట్‌వర్క్‌లను రూపొందించడం వంటి పనులను సైతం నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం భారత్ చిప్ తయారీ రంగంపై దృష్టి పెట్టటం, కొత్తగా వేదాంత కంపెనీని ఏర్పాటు చేయనుండటంతో వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. మార్కెట్లో హార్డ్‌వేర్‌ ఇంజనీర్లకు గరిష్ఠంగా ఏడాదికి రూ.50 లక్షల వరకు జీతాలు పొందుతున్నారు.

     English summary

know about these software high paid jobs that offering upto 60 lakh salary annually in india

know about these software high paid jobs that offering upto 60 lakh salary annually in india

Story first published: Sunday, September 25, 2022, 10:58 [IST]