Rasi Phalalu (27th Sep 2022) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

ఈ రోజు కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి.ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార,ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ రోజు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.