Krishna Vrinda Vihari Collections: సండే ఫుల్ కలెక్షన్స్.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ అవ్వాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే హ్యాండ్సమ్‌ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. సాదాసీదా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. అతి తక్కువ సమయంలోనే మంచి పేరును, విజయాలను సొంతం చేసుకున్నాడు. మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న శౌర్య.. క్రమంగా పంథాను మార్చుకుని విభిన్నమైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచానలతో వచ్చిన ఈ మూవీ 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో అనీష్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ మూవీనే ‘కృష్ణ వ్రిందా విహారి’. ఈ చిత్రంలో షెర్లీ సేతియా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలకమైన పాత్రలు చేశారు.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగశౌర్యకు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య పెద్దగా హిట్లు కూడా లేవు. దీంతో ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. కానీ, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాల వల్ల క్రమంగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ అయింది.

‘కృష్ణ వ్రిందా విహారి’ ఏపీ, తెలంగాణలో 3వ రోజు వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.13 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీకి 3 రోజుల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి రూ. 2.75 కోట్లు షేర్, రూ. 4.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 2.75 కోట్లు వసూలు చేసిన ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని రూ. 13 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 52 లక్షలు వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.40 కోట్లు షేర్‌, రూ. 6.20 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

స్విమ్‌సూట్‌లో అమలా పాల్ పరువాల విందు: ఇంత హాట్‌గా ఇదే తొలిసారి

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.60 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.40 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.20 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రిందా విహారి’ మూవీకి మొదటి రోజు టికెట్ రేట్ల తగ్గింపు వల్ల అనుకున్న కలెక్షన్లు రాలేదు. కానీ, రెండో రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. కోటి పైగా కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజు వసూళ్లు మరింతగా పెరిగాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ అంచనాలను అందుకున్నట్లే అని చెప్పొచ్చు. వీక్ డేస్‌లో ప్రదర్శనపై ఈ మూవీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.