Kerala: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ప్లానింగ్.. ఒక్కసారిగా మారిన అదృష్టం.. కోటీశ్వరుడైన ఆటోవాలా..

     For Quick Alerts 

Subscribe Now      

Kerala: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ప్లానింగ్.. ఒక్కసారిగా మారిన అదృష్టం.. కోటీశ్వరుడైన ఆటోవాలా.. 

For Quick Alerts 

ALLOW NOTIFICATIONS      

bredcrumb

bredcrumb

   |                                           Published: Monday, September 19, 2022, 10:00 [IST]                   

Kerala: బతుకు జీవుడా అంటూ విదేశాలకు ఉపాధి కోసం చాలా మంది వెళుతుంటారు. ఇందులో కేరళకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. అలా ప్రయత్నాలు చేస్తున్న ఒక ఆటో డ్రైవర్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన కథ ఇప్పుడు తెలుసుకుందాం..

మలేషియా వెళ్లేందుకు..  

మలేషియా వెళ్లేందుకు..

ఉపాధి నిమిత్తం మలేషియా వెళ్లేందుకు రూ.3 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ ఆటో డ్రైవర్‌కు ఆదివారం కేరళలో రూ.25 కోట్ల లాటరీ తగిలింది. అనూప్.. చెఫ్‌గా పని చేసేందుకు మలేషియా వెళ్లాలని అనుకున్నాడు. దీనికి అవసరమైన డబ్బు కోసం లోన్ అప్లై చేయగా బ్యాంక్ శనివారం ఆమోదించింది. అయితే.. ఆదివారం అతడు ఓనం లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు వెల్లడి కావటంతో అతని తలరాత మారిపోయింది. ఆటోవాలా ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయాడు. శనివారం లాటరీ కొనుగోలు..

శనివారం లాటరీ కొనుగోలు..

అనూప్ విజేత టికెట్ నెం. TJ 750605ని శనివారం కొనుగోలు చేశాడు. అయితే ఇది తన మొదటి ఎంపిక కాదని ఆయన అన్నారు. అనూప్‌కు తాను ఎంచుకున్న మొదటి టిక్కెట్‌ నచ్చలేదని, అందుకే అతను వేరే టిక్కెట్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. తాను ఎంచుకున్న టిక్కెట్ విజేతగా మార్చటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 22 ఏళ్లుగా లాటరీ కొనుగోలు..

22 ఏళ్లుగా లాటరీ కొనుగోలు..

జాక్‌పాట్ కొట్టిన తర్వాత ఆటో-డ్రైవర్ లోన్ గురించి, తన మలేషియా పర్యటన గురించి మాట్లాడాడు. బ్యాంక్ అందిస్తున్న రుణాన్ని తిరస్కరించినట్లు తెలిపాడు. తాను మలేషియా వెళ్లబోనని చెబుతున్నాడు. అయితే.. తాను గత 22 సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని.. ఇంతకు ముందు ప్రయత్నాల్లో వందల నుంచి రూ.5 వేల వరకు గెలుచుకున్నట్లు తెలిపాడు. భార్యకు చూపించటంతో..

భార్యకు చూపించటంతో..

తాను గెలుస్తానని ఊహించలేదని.. అందుకే లాటరీ ఫలితాలను టీవీల్లో చూడలేదని అనూప్ చెప్పాడు. ఫోన్ చెక్ చేయగా.. గెలిచినట్లు మెసేజ్ వచ్చినట్లు తెలిపాడు. తాను గెలిచిన విషయాన్ని నమ్మలేక దానిని భార్యకు చూపించానని చెప్పాడు. అది విన్నింగ్ నంబర్ అని ఆమె ధృవీకరించిందన్నాడు. అయితే నమ్మకం కుదుర్చుకునేందుకు లాటరీ టిక్కెట్లు అమ్మే ఒక మహిళకు ఫోన్ టికెట్ ఫోటో పంపానని.. ఆమె విజేతనని ధృవీకరించటంతో టెన్షన్‌ తగ్గిందని చెప్పుకొచ్చాడు.

టాక్స్ తరువాత..

టాక్స్ తరువాత..

అన్ని పన్నులు మినహాయించిన తర్వాత తనకు సుమారు రూ.15 కోట్లు వచ్చే అవకాశం ఉందని అనూప్ చెబుతున్నాడు. అయితే వచ్చిన ఈ సొమ్ముతో తన కుటుంబానికి ఇల్లు నిర్మిస్తానని తెలిపాడు. ఆ తర్వాత తనకు ఉన్న అప్పులను తీర్చటాన్ని మెుదట చేస్తానని అంటున్నాడు. హోటల్ రంగంలో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తానని చెప్పాడు.

      English summary

auto driver in kerala won 25 crores in onam lottery who planned to go malaysia

auto driver in kerala won 25 crores in onam lottery who planned to go malaysia

Story first published: Monday, September 19, 2022, 10:00 [IST]