Guppedantha Manasu: నువ్ అబద్ధమా.. నీ ప్రేమ అబద్ధమా.. నాకోసం వచ్చేస్తావా?

వసుధార కోసం రిషి మాట్లడాటడేందుకని ఒక చోట ఎదురు చూస్తుంటాడు. ఇంతలో వచ్చిన వసుధార.. సార్ ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు అని అంటుంది. నీకు గాలి, నీరు, పకృతి అంటే ఇష్టం కదా వసుధార.. వాటి సాక్షిగానే నీతో మాట్లాడాలని రమ్మన్నాను అని రిషి చెబుతాడు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని కంగారుగా మనసులో అనుకుంటుంది వసుధార. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా అని అనుకుంటున్నావా .. అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయని రిషి అంటాడు. ఇలా ఆసక్తిర కథనంతో సాగుతోంది లవ్ స్టోరీ సీరియల్ గుప్పెడంత మనసు. అయితే సెప్టెంబర్​ 26, 2022 సోమవారం నాటి గుప్పెడంత మనసు సీరియల్​ తాజా ఎపిసోడ్​ 565లో ఏం జరిగిందో చదివేసేయండి.

ఈ ప్రపంచంలో అందరూ నన్ను బాధపెట్టినా ఓర్చుకున్నా.. కానీ చివరికీ నువ్వు కూడా నా దగ్గర అలాగే ప్రవర్తించావ్ అని రిషి అనడంతో.. నేనేం చేశాను సార్ అని వసుధార అంటుంది. దీంతో ఫోన్ తీసి వసుధారకు చూపిస్తాడు. అందులో వసుధారకు మత్తుమందు ఇచ్చి సాక్షి కిడ్నాప్ చేయించడం చూపిస్తాడు. ఆ వీడియో చూసిన వసుధార షాక్ అవుతుంది. ఏంటిది వసుధార.. సాక్షి విషయం నా దగ్గర ఎందుకు దాచావ్. అసలు ఏంటి వసుధార నువ్వు.. ఇంత జరిగినా నా దగ్గర దాస్తావా.. అని బాధగా అడుగుతాడు రిషి. దాయడానికి కారణం ఉంది సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. వసుధార నేను కారణం అడగలేదు. ఒక నిజాన్ని దాయడం పొరపాటు. దాచిపెట్టడం మోసం అవుతుంది కదా.. సాక్షి విషయాన్ని నాకెందుకు చెప్పలేదని రిషి అంటాడు.

సార్ కావాలనే చెప్పలేదు. ఒక రోగికి తన ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్ నిజాన్ని దాచాల్సి వస్తుంది. ఇది కూడా అంతే సార్. అందరి మంచి కోసమే దాచాను. నిజం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో.. సాక్షిని ఏం చేస్తారోనన్న భయంతో చెప్పలేదు సార్ అని అంటుంది వసుధార. వసుధారా.. నీ భయం మాత్రమే నువ్వు ఆలోచిస్తావా.. నీకు ఏమవుతుందోనని నేను భయపడతాను కదా.. అంటూ రిషి అరుస్తాడు. అసలు సాక్షి అంత సాహసం చేసింది. తన ఉద్దేశం ఏంటో నీకేం తెలుసు.. నాకేం తెలుసు.. దాపరికాలు లేని ప్రేమ.. మన మధ్య ఉండాలని కోరుకున్నాం కదా.. నువ్వు కూడా ప్రతి విషయం ఇలా దాచేస్తే మన ప్రేమ అబద్ధమా.. నువ్వు అబద్ధమా వసుధార.. అంటూ ఆవేదనతో అంటాడు రిషి. సార్.. ప్రేమ అంటేనే అన్నింటినీ ఓర్చుకోవడమే కదా సార్.. మీ మనసుకి కష్టం కలిగించేది, ఇబ్బంది పెట్టేదనే సాక్షి విషయం చెప్పలేదు సార్ అని అంటుంది వసుధార.

అదంతా నువ్వు ఎలా నిర్ణయిస్తావ్ వసుధార.. చెప్పకుండా ఈ విషయం దాచావ్.. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వసుధార అని అంటాడు రిషి. సార్ ఒక చిన్న విషయంలో మీరు నన్ను అపార్థం చేసుకునే వరకూ వెళ్లకండి అంటుంది వసుధార. అన్నీ నువ్వే డిసైడ్ చేస్తే ఎలా వసుధార.. నా ప్రమేయం లేకుండా మా డాడ్ కి మాటిచ్చావ్.. ఒప్పందాలు జరుగుతాయి. కానీ నాకు తెలియదు. నాకు చెప్పవు. నువ్వు నాకు చెప్పవు కాదా.. నేను చాలా మందికి అవసరం లేదనిపిస్తుందేమో.. నా విలువ నేనే చెప్పుకోవడం నా దురదృష్టకరం అని బాధగా అంటాడు రిషి. సార్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. ఇంకెలా మాట్లాడాలి వసుధార. జగతీ మేడంని అమ్మా అని పిలిపించాలని నాతో ప్రేమగా దగ్గరయ్యావా.. మనసులో ఏవో ప్లాన్స్ వేసుకుని నాతో ప్రయాణం మొదలు పెట్టావా.. అంటాడు రిషి.

సార్ నేను ఏ ప్రణాళికలు వేసుకోలేదు. నా ప్రేమ స్వచ్ఛమైనది అని అంటుంది వసుధార. అయినా వినకుండా ఇలానే ప్రశ్నలమీద ప్రశ్నలు వేసి వసుధారను బాధపెడతాడు రిషి. ఇలా అనేక మాటల తర్వాత జగతి విషయం, సాక్షి విషయం మనసులో నుంచి తీసేయ్ వసుధార. ఇక నుంచి నన్ను బాధించే పనులు చేయొద్దు.. నా దగ్గర ఎలాంటి విషయం దాచిపెట్టొద్దు.. జగతి మేడమ్ చాలా తెలివైన వారు. ఆమె సమర్థతని, గొప్పతనాన్ని అభినందిస్తాను.. ఇంతే ఇంకేం లేదు.. మనిద్దరినీ కలిపిన వారధిగా ఆమె మీద ప్రత్యేక అభిమానం.. అంతేకానీ బంధం, పేగు బంధం లాంటి ఉండవు.. ఉండొద్దు కూడా.. వసుధార నీకు ఇంతకు ముందు చెప్పాను.. మళ్లీ చెబుతున్నాను.. ఇక మన మధ్య ఈ ప్రస్తావన రావొద్దు పదా.. అని కారు ఎక్కుతాడు రిషి.

తర్వాత కారులో వెళ్లేటప్పుడు వసుధార కోసం పూలు తీసుకుంటాడు రిషి. వసుధార చేతిలో పెట్టి నువ్ అనుకున్నది కాదు అన్నాను.. నిన్ను కాదు వసుధార. నువ్వు వచ్చేదారిలో ఎప్పుడు ఈ రిషీంద్ర భూషణ్ ఎదురు చూస్తూ ఉంటాడు అని చెబుతాడు. వసు నవ్వుతుంది. ఆ పూలు చూసి మురిసిపోతుంది. తర్వాత ఆ పూలను తన రూమ్ కు తీసుకువెళ్లి వాటితో లవ్ సింబల్ వేసి చూసుకుంటుంది. వీఆర్ అని పేపర్ మీద రాసి ఆ పూల మధ్యలో పెడుతుంది. దాన్ని ఫొటో తీసి రిషికి పంపిస్తుంది. రిషికి ఫోన్ చేసిన తనపై కోపం తగ్గిందా అని అడుగుతుంది వసుధార. నా కోపం, నా ప్రేమ రెండింటిన ఒక త్రాసులో వేసి చూడకు వసుధార.

నాకు కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే.. నా కోసం వచ్చేస్తావా.. నువ్వు ఈ ఇంటికి నా కోసం రావడానికి సిద్ధమా అని అంటాడు రిషి. దీంతో ఏం మాట్లాడకుండా వసుధార ఉండటంతో.. సరే నువ్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదన్నమాట అని రిషి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి దగ్గరికి జగతీ వస్తుంది. వచ్చి ప్రేమ బంధం గురించి కొన్ని మాటలు చెబుతుంది. అటువైపు నుంచి కూడా సమానమైన బాధ్యత ఉంటుంది కదా మేడం, తన (వసుధార) కోసం వెనుకడుగు వేయలేను అని రిషి అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది వచ్చే ఎపిసోడ్ వరుకు ఆగాల్సిందే.